Vizianagaram

News February 2, 2026

కలెక్టర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి కొండపల్లి

image

గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం నూతన భవనాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ రాం సుందర్ రెడ్డిని కొండపల్లి ప్రశంసలతో ముంచెత్తారు. జిల్లా అభివృద్ధికి రథసారథిగా నిలుస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కార దిశగా పనిచేస్తున్నారని కలెక్టర్‌ను కొనియాడారు.

News February 2, 2026

ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వైద్య బీమా: మంత్రి

image

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య బీమా కల్పించే పథకాన్ని సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎస్.కోటలో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 65 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో రోగికి ఏడాదికి సుమారు రూ.20 వేలు ఖర్చు చేయడమే కాకుండా నెలకు రూ.10 వేలు పింఛన్ కూడా ఇస్తున్నామని తెలిపారు.

News February 2, 2026

పలు కేసుల్లో నిందితుడిపై PD యాక్ట్: VZM SP

image

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మజ్జి కృష్ణవర్ధన్ (చెర్రీ)పై జిల్లా పోలీసు శాఖ PD యాక్ట్ ప్రయోగించింది. నిందితుడిని ముందస్తు నిర్బంధంలో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని SP దామోదర్ ఆదివారం తెలిపారు. గత ఐదేళ్లలో విజయనగరానికి చెందిన చెర్రీపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో 8, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

News February 2, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News February 1, 2026

VZM: ఆప్యాయంగా పలకరించుకున్న బొత్స, పతివాడ

image

మండలి విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం పూసపాటిరేగలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. బొత్స భుజంపై పతివాడ చేయి వేసి స్నేహపూర్వకంగా పలకరించారు. కాసేపు సరదాగా ముచ్చటించుకుంటూ పరస్పర ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రమంతా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన జిల్లాలో మాత్రం రాజకీయాలు హుందాగా సాగుతున్నాయి.

News February 1, 2026

విజయనగరం: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

image

విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలం వన్నలిలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు రానున్నారని సమాచారంతో ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్ ప్రమీలగాంధీ శనివారం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామంలో రీసర్వే బాగుండడంతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారన్నారు. తహశీల్దార్ కృష్ణలత పాల్గొన్నారు.

News February 1, 2026

విజయనగరం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో పురుగులమందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో చోటు చేసుకుంది. ఎన్.లక్ష్మణరావు నిత్యం మద్యం తాగడంతో భార్య రామలక్ష్మి గతనెల 30న మండలించారు. దీంతో పురుగులమందు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ కొండలరావు తెలిపారు.

News February 1, 2026

VZM: వ్య‌వ‌సాయ అధికారుల డైరీని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

image

ఏపీ వ్య‌వ‌సాయ అధికారుల సంఘం ప్ర‌చురించిన 2026 డైరీని, పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి శ‌నివారం త‌మ ఛాంబ‌ర్‌లో ఆవిష్క‌రించారు. వ్య‌వ‌సాయ అధికారుల‌కు త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో ఈ డైరీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. విజయనగరం యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ జేడీ వీటీ రామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు కె .ప్రకాష్ పాల్గొన్నారు.