India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్‌కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
మక్కువ మండలం కన్నంపేటకి చెందిన ఆర్మీ జవాన్ తేలు దినేష్ (34) ఈనెల 12న సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో చికిత్స కోసం విజయనగరం తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. పి.చంద్రపాత్రో అనే వ్యక్తి మూడో ప్లాట్ ఫామ్ వద్ద రైలు దిగుతుండగా కాలు జారి కింద పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.
మొహర్రం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా విద్యా శాఖాధికారి ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందువుల పండుగ తొలి ఏకాదశి, మొహర్రం రెండూ కలిసి రావడంతో సెలవును ప్రకటించిందన్నారు. స్పెషల్ క్లాసులు, స్టడీ హవర్స్ పేరిట పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెంటాడ మండలం మీసాలపేట సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధురాలు మరణించిందని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమీక్షలు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతున్నారని తెలిపారు.
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాల్సిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌లను ఈ నంబరుకి ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు.
విజయనగరంలోని అలకానంద కాలనీలో ఓ రైల్వే ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం, రైల్వేలో టీఏగా పనిచేస్తున్న శంకర్రావు మధ్యానికి బానిస కావడంతో భార్య ఆదివారం రాత్రి మందలించింది. మనస్తాపానికి గురైన శంకర్రావు తన రూమ్‌లో ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భోగాపురం మండలంలో అసైన్డ్ భూములపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరిట భూములను దోచుకున్నారని మండిపడ్డారు. మాజీ సీఎస్ జవహార్‌రెడ్డి భోగాపురం మండలంలోని అసైన్డ్ భూములను బినామీల పేర్లతో దోచుకున్నారు కదా అని పలువురు విలేకర్లు సీఎంను ప్రశ్నించారు. దీనికి స్పందించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మద్దుతు కోరుతున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.