India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బలిజిపేట మండలంలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. గంగాడ గ్రామానికి చెందిన సావిత్రి (56) మిస్సింగ్‌కు సంబంధించి కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆమె భర్త, కొడుకు కలిసి హత్య చేశారని మృతురాలి మేనల్లుడు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామభద్రపురం మండలంలో ఆరు నెలల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయనగరం ఘోషా ఆసుపత్రిలో <<13625276>>చిన్నారి<<>> చికిత్స పొందుతోంది. చిన్నారి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డను ఊయలలో వేసి సరకుల కోసం బయటకి వెళ్లి వచ్చేసరికి పాప ఏడుస్తోందని తెలిపింది. ప్రశ్నించే సరికి అతడు పారిపోయాడని, పక్క గ్రామంలో తమ వాళ్లు పట్టుకున్ననట్లు చెప్పింది. అతనికి ఉరి శిక్ష వేయాలని ఆమె కోరింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 13 అంబేడ్కర్ గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లాల కో-ఆర్డినేటర్ ఫ్లోరెన్స్ తెలిపారు. తెలుగు, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, గణితం,జువాలజీ, హిందీ, ఎకనామిక్స్, పీడీ, స్టాఫ్ నర్స్ వంటి కొలువులకు నెల్లిమర్ల గురుకులంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఉదయం 9:30కు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు. >Share it
అభం శుభం తెలియని ఆరునెలల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన సంఘటనపై, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఘోషాసుపత్రి వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను ఆయన వాకబు చేశారు. బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో పసికందుపై జరిగిన <<13625276>>అత్యాచార<<>> ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆమె స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఘోషాసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
లద్దాక్‌లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అసువులుబాసిన సైనికుడు గొట్టాపు శంకరరావు భౌతిక కాయం శనివారం బొత్సవానివలస చేరుకుంది. సైనిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ‘నా పిల్లలు ఏం పాపం చేశారు దేవుడా.. ఇంత చిన్న వయసులో వారికి తండ్రిని దూరం చేశావని’ భార్య కోమలత రోదించిన తీరు, దు:ఖాన్ని దిగమింగి తండ్రి భౌతికాయానికి సెల్యూట్ చేసిన పిల్లలను చూసి అక్కడున్నవారు కన్నీరు పెట్టుకున్నారు.
రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో దారుణం జరిగింది. ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. బాధిత చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం జరగడంతో బాడంగి ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ లో అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 381 మందికి సీట్లు లభించాయి. విజయనగరం జిల్లాలో 286 మంది విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 95 మంది విద్యార్థులు సీట్లు సాధించి 20వ స్థానంలో నిలిచారు.
జిల్లా ఎస్పీగా దీపిక పాటిల్ మూడేళ్లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2021 జులై 12న విధుల్లో చేరిన ఆమె తక్కువ కాలంలోనే అన్ని పోలీస్ స్టేషన్‌లలో సుడిగాలి పర్యటనలు చేసి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రామభద్రపురం, పీ.కోనవలస, బొడ్డవర చెక్ పోస్ట్‌లను బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాను సాధ్యమైనంతగా నిరోధించారు. మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించారు.
విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్‌గా మలికా గర్గ్‌ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.
Sorry, no posts matched your criteria.