India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా వైద్య సేవా సిబ్బందితో జిల్లా సమన్వయకర్త అప్పారావు బుధవారం నెలవారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సేవా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. రోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్, టీమ్ లీడర్లు, వైద్య సేవా సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ కోర్టుల్లో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ – సెకండ్ క్లాస్ పోస్టుల్లో నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్టు జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణ చక్రవర్తి వెల్లడించారు. బొబ్బిలి, కొత్తవలస, పార్వతీపురం, సాలూరులో ఈ పోస్టుల నియామకం కోసం రెండు నోటిఫికేషన్లు విడుదల చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు అదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ రద్దు చేసినట్లు తెలిపారు.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పేరును YCP అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 1955లో బొబ్బిలి మండలం పక్కిలో జన్మించిన ఆయన 1983,85,94లో TDP ఎమ్మెల్యేగా, 2019లో YCP ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే ప్రొటెం స్పీకర్, ప్రభుత్వ విప్ పదవులు కూడా నిర్వహించారు. ప్రధానంగా కొప్పలవెలమ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఆయనకు పేరుంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలు బుధవారం భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలు, పలువురు ఆశావాహులు తాడేపల్లికి పయనమయ్యారు. వైసీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన ఆశ్రమ పాఠశాల ఒప్పంద ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరులో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, SI సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో MRO, MPDO, ఎస్ఐ ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.
టెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులను సాధించిన విద్యార్థినులను విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వని 150/150 మార్కులను, దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కులను సాధించిన దేవ హారికకు అభినందనలు తెలిపారు.
టెట్ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటో డ్రైవర్ అయిన శంకర్రావు, తల్లి వెంకటలక్ష్మి ఆమె సాధించిన మార్కుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి టీచర్‌గా మారి పిల్లలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. వీటి అగ్రహారానికి చెందిన ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన హారిక 149.46/150 మార్కులు సాధించారు.
శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పార్వతీపురం, విజయనగరం ఆర్.డి.ఓ. కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. నవంబరు 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు. డిసెంబరు 2 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.