India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.. ఓ పార్టీ అధినేత. లక్షలాది మంది అభిమానులున్న పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీ చాటుకున్నారు. పార్వతీపురం జిల్లా బాగుజోలలో పర్యటించిన ఆయన బురదలో కాళ్లకు చెప్పులేకుండా కిలో మీటరు నడిచి గిరిజనులతో మమేకమయ్యారు. ఆయన ప్రసంగానికి నులక మంచమే వేదికైంది. తెల్లని లాల్చి.. చలిని తట్టుకోవడానికి ఒంటిపై శాలువా కప్పుకున్నారు. ఈ ఫొటోలను ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.
జిల్లాలో చేపడుతున్న ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ శుక్రవారం రైతులతో ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గోనె సంచుల సమస్యలు ఏమైనా ఉన్నాయా అమ్మకాల పై ఏమైనా సమస్యలున్నాయా, డబ్బులు సక్రమంగా అందుతున్నాయా వంటి ప్రశ్నలు వేశారు. ఎటువంటి సమస్యలు లేవని రైతులంతా సానుకూలంగా తెలిపారని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రకృతి అందాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. సాలూరు నియోజకవర్గం బాగుజోల గ్రామంలో పర్యటనలో భాగంగా వెంగళరాయ సాగర్ ప్రాంతంలో కారు దిగి నడుచుకొంటూ కొంత దూరం వెళ్ళారు. అక్కడి ప్రకృతి అందాలను తన సెల్‌ఫోన్లో బంధించారు. బాగుజోలలో పలుమార్లు మన్యం అందాల గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలు అదృష్టవంతులని.. ప్రకృతి అందాలు తన మనసును కట్టి పడేస్తున్నాయని అన్నారు.
బాగుజోలలో పవన్ కళ్యాణ్ స్పీచ్ మధ్యలో యువత పెద్ద ఎత్తున ఓజీ..ఓజీ అంటూ నినాదాలు చేశారు. స్పందించిన పవన్ కళ్యాణ్ తాను మీసం తిప్పితే అభివృద్ధి జరగదని.. తన పని తనను చేసుకోనివ్వాలని అన్నారు. కనీసం రోడ్డు వేశారో లేదో చూడనీయకుండా మీద పడిపోతే.. అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల్లో క్వాలిటీ ఉందో లేదో యువతే చెక్ చేసి తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మక్కువ మండలం అంటే తనకు మక్కువ అని అన్నారు.
మక్కువ మండలం బాగుజోలలో గిరిజనులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శంబర పోలమాంబను తలచుకున్నారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించే శక్తిని తనకు ఇవ్వాలని శంబర పోలమాంబను వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సవర కళాకారులు వేసిన పెయింటింగ్స్‌ని భుజంపై పట్టుకుని మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గర్వంగా సవర కళ గురించి చెప్పినట్లు వెల్లడించారు. వాడుక భాష నేర్పించిన నేల ఉత్తరాంధ్ర అని ఆయన అన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను చూసి ఈర్ష్య పుడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంతటి ప్రకృతి అందాల మధ్య పుట్టిన మీరు అదృష్టవంతులని ఆయన అన్నారు. మిమ్మల్ని చూసి అసూయ పుడుతోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యటించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు శుక్రవారంతో ఏడాది పూర్తి చేసుకుంది. భోగాపురం మండలంలోని పోలిపల్లి గ్రామంలో నవ శకం పేరిట ఇదే రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ అప్పట్లో ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రముఖులు హాజరయ్యారు. నేటితో ఏడాది పూర్తి కావడంతో టీడీపీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న విజ్జి స్టేడియంలో మల్టీ పర్పస్ స్టేడియాన్ని రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి రాంప్రసాద్, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. షటిల్ కోర్టులో మంత్రులు షటిల్ ఆడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ అదితి గజపతి రాజు, అధికారులు పాల్గొన్నారు.
నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే చలితీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సాలూరులో పర్యటించనున్నారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో 11.30కి సాలూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బసకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 12.30కి మక్కువ మండలం బాగుజోలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ని సందర్శిస్తారు. తర్వాత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. అనంతరం అక్కడ గిరిజనులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు విశాఖ చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.