India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పసర మందు కారణంగా ఓ చిన్నారి బలైన ఘటన పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డుపాడు గ్రామంలో వెలుగుచూసింది. పోయి మెరకమ్మ, లక్ష్మణరావు దంపతులకు ఆరు నెలల చిన్నారి మంజుల ఉంది. మంజుల కొన్ని రోజులుగా దగ్గు, గురక వ్యాధితో బాధపడుతుండగా తల్లిదండ్రులు పసరు వైద్యాన్ని చేయించారు. ఆ వైద్యం వికటించడంతో మంజుల మృతిచెందింది. గ్రామానికి చెందిన వైద్య సిబ్బందికి కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా బి.సి.సంక్షేమ శాఖ అధికారి పెంటోజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 10-30 గంటలకు పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి అమరజీవికి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు వెల్లడించారు.
గంజాయి అక్రమ రవాణాకు నిందితులు తమ వాహనాలకు ఏకంగా ‘పోలీస్ బోర్డు’ను తగిలించుకుని తరలించడం విస్మయం కలిగిస్తోంది. గురువారం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద 810 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిందితులు తెలివిగా పోలీసులు, చెక్ పోస్టుల నుంచి తప్పించుకోవడానికి తమ వాహనాలకు ఏకంగా పోలీస్ బోర్డు, ఫేక్ నెంబర్ ప్లేట్‌లు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.
గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేట్ సమీపంలో నవంబర్ 29న మరుపల్లికి చెందిన స్నేహితులు సీర పైడిరాజు, చవుకు రామలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పైడిరాజు 30వ తేదీన చనిపోగా.. రామలక్ష్మి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయినట్లు గజపతినగరం ఎస్ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబుతో జరిగే సదస్సులో పార్వతీపురం, విజయనగరం కలెక్టర్లు అంబేడ్కర్, శ్యాంప్రసాద్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. మరి ఈ ఆరు నెలల వ్యవధిలో పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోని మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై మీ కామెంట్.
వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పూసపాటిరేగ, కొత్తవసల, మెరకముడిదాం మార్కెట్లు ఉన్నాయి. 20 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీరిలో MLA, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ, సర్పంచ్, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు, గ్రామ సర్పంచ్ ఉంటారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డా.అంబేడ్కర్, ఏ.శ్యాం ప్రసాద్ విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.
Sorry, no posts matched your criteria.