Vizianagaram

News December 9, 2024

రైతులు అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. ప్రస్తుతం ఎవరూ వరి కోతలు చేయొద్దని, ఇప్పటికే కోసిన వారు కుప్పలు పెట్టాలని పేర్కొన్నారు. నూర్చిన ధాన్యం ఉంటే సమీప కొనుగోలు కేంద్రానికి ఇవ్వాలన్నారు. టార్పలిన్ అవసరం ఉన్నవారు పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాలని కోరారు.

News December 7, 2024

విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.

News December 7, 2024

కంచరపాలెం అమ్మాయి కోసం గొడవ.. అరెస్ట్

image

విజయనగరానికి చెందిన సాయికుమార్ రెడ్డి(27) కంచరపాలెం యువతితో కలిసి పెదరుషికొండ వద్ద ఓ లాడ్జిలో 10రోజుల నుంచి ఉంటున్నారు. PMపాలేనికి చెందిన పి.వినయ్(23) ఆమెకు కాల్ చేయడంతో గురువారం బయటకు వెళ్లింది. తిరిగి మద్యం మత్తులో లాడ్జికి వచ్చిన యువతిని సాయి ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని ఆమె వినయ్‌కు చెప్పడంతో అతను తన ఫ్రెండ్స్‌తో కలిసి సాయిని దారుణంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో వినయ్‌ను అరెస్ట్ చేశారు.

News December 7, 2024

VZM: జిల్లాలో నేడు జరగనున్న ముఖ్య కార్యక్రమాలు ఇవే

image

➤శనివారం ఉదయం 8.45 గంటలకు సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని కలెక్టర్ అంబేద్కర్ ప్రారంభిస్తారు➤ఉదయం 9-00 గంటలకు మలిశర్లలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు ➤ఉదయం 9-00 గంటలకు జామి మండలం కుమరాంలో మెగా టీచర్స్, పేరెంట్స్ డే కార్యక్రమంలో మంత్రి కొండపల్లి పాల్గొంటారు ➤ఉదయం 10-30 గంటలకు కలెక్టరేట్‌లో క్షయ వ్యాధి నియంత్రణ పై వంద రోజుల క్యాంపెయిన్ ప్రారంభం

News December 6, 2024

విజయనగరం: పెరిగిన గుడ్డు ధర..! 

image

గుడ్డు ధర భారీగా పెరిగింది. విజయనగరం రైతు బజారులో రూ.6.34కు విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో రూ.7 అమ్ముతున్నారు. కాగా.. విజయనగరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. (KGలో) వంకాయ రూ.35, టమాటా రూ.45-48, బెండ రూ.30, కాకర రూ.35, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.38, క్యారెట్ రూ.55-70, దొండకాయలు రూ.30కి అమ్ముతున్నారు. మరి మీ దగ్గర కూరగాయలతో పాటు గుడ్డు ధర ఎంత ఉందో కామెంట్ చెయ్యండి.

News December 6, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కుదిరిన సయోధ్య

image

భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విభేదాలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు.

News December 6, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

image

ఉమ్మడి జిల్లాలో పలు PHCల్లోని పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లను హైకోర్టు ఆదేశాల ప్రకారం సర్వీసుల నుంచి తొలగిస్తూ ఇన్ ఛార్జ్ డిఎంహెచ్వో డాక్టర్ రాణి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పీహెచ్సీల్లో పనిచేస్తున్న సుమారు 56 మందిని విధుల నుంచి రిలీజ్ చేయాలని ఆయా పీహెచ్సీల వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు.

News December 6, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కుదిరిన సయోధ్య

image

భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విభేదాలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు.

News December 6, 2024

VZM: సీఎంతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ప్ర‌స్తుత ఖ‌రీఫ్ సీజ‌నులో జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ తెలిపారు. సీఎం చంద్ర‌బాబుతో గురువారం నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్సులో క‌లెక్ట‌ర్ ఈ విష‌యాలు వెల్ల‌డించారు. జిల్లాలో న‌వంబ‌రు 5 నుంచి ధాన్యం సేక‌ర‌ణ ప్రారంభించామ‌ని, డిసెంబ‌రు 5 వ‌ర‌కు నెల‌రోజుల్లో 56,592 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించామ‌న్నారు.

News December 5, 2024

VZM: ‘పేరెంట్స్ మీట్‌లో ప్రజా ప్రతినిధుల ఫోటోలు ఉండరాదు’

image

ఈ నెల 7న జరగనున్న మెగా పేరెంట్స్ మీట్‌కు సంబందించి కలెక్టర్ అంబేడ్కర్ సంబంధిత అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్స్ , టీచర్స్ మీట్ పండగలా జరగాలన్నారు. విద్యార్థుల చదువు కోసం జరిగే ఈ కార్యక్రమాల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని, మంత్రుల ఫోటోలు, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల ఫోటోలు పెట్టకూడదన్నారు.