India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలనే వాడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్‌లో పొల్యూషన్ బోర్డ్ అధికారులతో కలిసి నిర్వహించిన ముందస్తు సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తయారైన విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు.

భీమవరం మున్సిపల్ కార్యాలయంలో “భారతదేశ జనాభా గణన 2027” శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వీరవాసరం జడ్పీటీసీ గూండా జయప్రకాశ్ నాయుడుపై భీమవరం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయలక్ష్మి ఫిర్యాదుతో ఆయనపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్, దాడి తదితర నాలుగు కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. నిందితుడిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఏలూరు జిల్లాలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ఉచిత మెడికల్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు జర్నలిస్టులకు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం భీమవరం కలెక్టర్ ప్రాంగణంలో భీమవరం లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్, ఒమిక్స్ నెక్స్ట్‌జెన్ లాబరేటరీస్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతాయన్నారు.

యలమంచిలి మండలం ఆర్యపేటకు చెందిన లక్ష్మి కుమారి (44) అనే మహిళ కువైట్ దేశంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె గత 4 ఏళ్లుగా కువైట్‌లోని ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇండియన్ ఎంబసి సహకారంతో మృతదేహం కార్గో విమానంలో శుక్రవారం ఇండియా చేరుకొనుంది.

పెనుగొండ మండల వడలి శివారు ఇటుకల బట్టి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట వేమవరం గ్రామానికి చెందిన మైలే రాజారావు (55) తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో, ట్రాక్టర్ మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన ఎడమ కాలు, చెయ్యి నుజ్జునుజ్జు అయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నరసాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక(7)పై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఈనెల 4న స్కూల్ ముగిసిన తర్వాత వ్యాన్‌లో ఇంటికి వస్తుండగా, డ్రైవర్ నక్కా మహేంద్ర బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు వివరించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.