India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఎస్పీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీస్ అధికారులు, సిబ్బంది, జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాలకొల్లు బస్టాండ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ ‘స్త్రీ శక్తి’ పథకాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు శివదేవుని చిక్కాల నుంచి కూటమి నేతలు, మహిళలతో కలిసి అలంకరించిన ఆర్టీసీ బస్సులో ఆయన సభాస్థలికి చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులు మంత్రికి స్వాగతం పలకగా, మహిళలు హారతులిచ్చారు. ఇచ్చిన హామిలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని మంత్రి అన్నారు.
తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించిన ఆమె రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరతను అడిగి తెలుసుకున్న ఆమె సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ తాతారావు పాల్గొన్నారు.
భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ ధర్మకర్తల మండలి నియామకానికి దేవాదాయ శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. హిందూ మతానికి చెందిన 13 మందిని ధర్మకర్తలుగా నియమిస్తారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలయం వద్ద దరఖాస్తులను పొందవచ్చని ఆయన తెలిపారు.
వసతి గృహాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. తణుకులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వసతి గృహంలోకి చేరిన నీటిని పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించబోమని, ఏ సమస్య ఉన్నా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం తగ్గడంతో నీరు తొలగిపోతే పంటకు ఎలాంటి నష్టం ఉండదని కలెక్టర్ అన్నారు. సుమారు 400 నుంచి 500 ఎకరాల పంట ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.
తణుకులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలు వార్డులను సందర్శించిన ఆమె రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యుల కొరతను అడిగి తెలుసుకున్న ఆమె సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ తాతారావు పాల్గొన్నారు.
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేశామని చెప్పారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి.వాసు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిందని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఎవరూ బీచ్‌కు రావొద్దని స్పష్టం చేశారు.
రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08816-299181 ను సంప్రదించవచ్చు.
Sorry, no posts matched your criteria.