India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా స్ఫూర్తి భవనంలో శుక్రవారం కొల్లేరు పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే రిజర్వాయర్‌గా మారే ప్రమాదం ఉందని, విద్యుత్తు ఉత్పత్తిలో ఆటకం ఏర్పడుతుందన్నారు. రుషికొండ కట్టడాల్ని పర్యాటకరంగానికి వినియోగిస్తే ఆదాయం వస్తుందన్నారు.
నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ ఛైర్మన్ గంగుల వెంకటలక్ష్మితో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు వైసీపీ శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు విధానాలు వ్యతిరేకిస్తూ తామంతా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కౌన్సిల్లో మొత్తం 28 మంది సభ్యులకు గాను 27 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా 11 మంది రాజీనామా చేశారు.
ప.గో.జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మూడుసార్లు తుఫాన్లు వచ్చాయని.. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అధికారులు సంబంధిత ఇరిగేషన్ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 9 ప్రధాన కాలువలు ద్వారా 4,03,001 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద నుంచి ఎస్పీ ప్రతాప్ కిషోర్ అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకొని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు.
అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉమ్మడి ప.గో. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వరి కోతలు ముగించుకొని రోడ్లపై ధాన్యాం రాశులను రైతులను ఆరబెడుతున్నారు.
పంట చేతికి వచ్చే సమయం కావడంతో వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు భయాందోళన చెందుతున్నారు.
ఏలూరు జిల్లాలో భూసేకరణ పనులను సంబంధిత ఆర్డీవోలు ఎప్పటికప్పుడు సంబంధిత తహశీల్దార్లతో సమీక్షించి వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం జాతీయ రహదారులు, పరిశ్రమలు, ఫిషింగ్ ఔట్లెట్స్ ఏర్పాటు భూసేకరణ అంశాలపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి కోర్టులలో ఉన్న కేసులు సత్వరమే పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ ముస్సూరీకి చెందిన పదిమంది ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం మొగల్తూరు మండలం బీచ్‌ను సందర్శించారు. వీరికి మొగల్తూరు మండల తహశీల్దార్ కిషోర్, ఎంపీడీవో, ఎంపీడీవో త్రిశూలపానీలు బీచ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా ఎంతో రమ్యంగా ఉందని ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం ఏలూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా డీజిల్ ధర రూ.97.76 ఉంది. అలాగే ప.గో జిల్లాలో డీజిల్ రూ.97.24 ఉండగా.. పెట్రోల్ ధర రూ.109.40 ఉంది.
ఉల్లిధర వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. నెల నుంచి వారవారానికి ధర ఎగబడుతోంది. పెనుగొండ మార్కెట్లో ఉల్లి ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా కార్తీక మాసం కావడంతో ఈ వారం రోజుల్లోనే రూ. 70-80 కి చేరిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతి తగ్గడంతో ధరలు ఊపందుకున్నాయని అంటున్నారు.
పెనుగొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మహేంద్రకుమార్, అతని కుటుంబానికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మహేంద్రకుమార్ భార్య చైతన్యను అదనపు కట్నం కోసం హింసిస్తూ ఉంటే అతని తల్లి, తండ్రి సహకరించేవారు. దీంతో 2020లో బాధితురాలు ఆచంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు బుధవారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షలు జరిమానా విధించి, ఆసొమ్మును చైతన్యకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
Sorry, no posts matched your criteria.