India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరుకు చెందిన లాయర్ కార్తీక్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. ఏలూరు 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కార్తీక్ HYDలో వేరే కులానికి చెందిన మనీషాను 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య తరఫువాళ్లు కుల వివక్ష చూపేవారు. 2023లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, తన వారితో కేసులు పెట్టించడంతో మనోవేదనకు గురై మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు.
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, నాయకులు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా భీమవరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు రామాంజనేయులు, రఘురామ కృష్ణరాజు, కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఉన్నారు. అంతా కలిసి చెత్త ఊడ్చి డస్ట్‌బిన్‌లో వేశారు.
వైసీపీ హయాంలో తనపై దాడి చేశారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటీవలే కాదంబరీ జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేశారని, అలానే తనకు కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా అడుక్కోవాలంటే సిగ్గుగా ఉందన్నారు.
నరసాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఉన్న గోదావరి ప్రాంతమంతా సోమవారం ఎరుపు రంగులో కనిపించిది. సాయంత్రం 5 గంటలకు సంధ్యా సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఎరుపు రంగులో కమ్ముకున్నాయి. దీంతో గోదారి రంగు మారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పలువురు ఈ చిత్రాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
మీరు చదివింది నిజమే. రూ.20కే 11 కేజీల గణేశ్ లడ్డూ ఇవ్వనున్నారు. ప.గో జిల్లా పోడూరు మండలం మట్టపర్రులో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 కేజీల లడ్డూను రూ.20కే అందించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం లడ్డూకు సంబంధించిన లక్కీ డ్రాను తీయనున్నారు. మరి ఆ లడ్డూ ఎవరికి దక్కుతుందనేది మరికాసేపట్లో తెలియనుంది. మరి మీ ఏరియాలోనూ ఇలాంటి లక్కీ డ్రా నిర్వహించి ఉంటే కామెంట్ చేయండి.
గోదావరికి వరద ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఆదివారం సాయంత్రానికి 31.57 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ద్వారా 8.14 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గోదావరికి వరద తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై శనివారం రాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న తమ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు DSP దేవకుమార్ పేర్కొన్నారు.
ఇవాళ ఈద్ – ఎ – మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలు ఈ సమాచారాన్ని గమనించి భీమవరంలోని కలెక్టర్ కార్యాలయానికి ఎవరూ రావద్దని సూచించారు.
ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్, డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావున ప్రజల ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.