India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన రైతాంగం, ప్రజలకు రుణ సౌకర్యంపై బ్యాంకర్లతో ప్రత్యేక డీసీసీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భీమా క్లైముల పరిష్కారంలో రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్లైన్లో చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్వోదయ మండలి ఉమ్మడి ప.గో.జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ.. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజ్ డ్రాయింగ్ షీటుపై చిత్రం వేసి, స్కాన్ చేసి ispeducation@gmail.com మెయిల్‌కు ఈ నెల 21వ తేదీ లోపు పంపాలన్నారు.
మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌కి వచ్చే పర్యాటకులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. పేరుపాలెంలోని మొలపర్రు కనకదుర్గా బీచ్‌కి వెళ్లే మార్గంలో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ రహదారి మీదుగా ప్రయాణాలు నిలిపివేశామన్నారు. పర్యాటకులు ఈ విషయం గమనించి ఇతర మార్గాల్లో బీచ్‌కు వెళ్లాలని కోరారు.
ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది. కామవరపుకోట మండలం కళ్ళచెరువుకు చెందిన AMC మాజీ ఛైర్మన్ మేడవరపు అశోక్ బాబు శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఏలూరు జిల్లాలోని రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
భార్యను హత్యచేసిన కేసులో భర్త అరెస్ట్ అయ్యాడు. ఆకివీడు CI జగదీశ్వరరావు వివరాలు.. ఉండి మండలం కలిగొట్లకు చెందిన సత్యవతి ఈ నెల 5న హత్యకు గురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త చిరంజీవి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం అరెస్ట్ చేసి భీమవరం కోర్టులో హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారన్నారు.
అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. కొవ్వూరు మండలం మద్దూరులో బుధవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి 13 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై శ్రీహరి తెలిపారు.
వరద బాధితులకు సహాయం అందించటంలో ప.గో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం అన్నారు. 13 మంది దాతలు సహాయంతో రూ.47,88,500/- లు వరద బాధితులకు నగదు, 4.09 లక్షల ఆహార పొట్లాలు, 1.85 లక్షల వాటర్ బాటిల్స్, 1.10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 9,500 బన్నులు, 21,400 రస్కులు, 1.62 బిస్కెట్ ప్యాకెట్లు, 25 కేజీల రైస్ బ్యాగ్స్ 700 అందజేయడం జరిగింది అన్నారు.
ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్ అదాలత్‌ను సెప్టెంబరు 14న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ కుమార్ తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా కోర్టులో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్, కుటుంబ వివాదాలు, టెలిఫోన్, బ్యాంకు కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.
ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ వాసుదేవ్ ఏలూరు 1- Town పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి, ముద్దాయి బడిగంటల లీల రాజు 3 సం.ల 15 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.6500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదనలను వినిపించి ముద్దాయికి శిక్ష పడటంలో సహకరించారన్నారు.
స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమంలో బాగంగా స్వఛ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించడానికి అధికారులంతా సిద్ధం కావాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు జరిగే స్వచ్ఛతా హి సేవాకార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.