India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలవరం మండలం వింజరం గ్రామం నుంచి గార్ల గొయ్యి వెళ్లే రహదారి పై ఉన్న కల్వర్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుధవారం నాటికి సగం పైనే కొట్టుకుపోయింది. దీంతో నిత్యం ఇదే దారిలో వెళ్లే స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర అనేక వాహనాలు ప్రయాణించడం ప్రమాదకరంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.
సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా విద్యాశాఖాధికారిణి నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 15న, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 25 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు.
ప.గో.జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 42.86 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ జిల్లా అధికారి దేవానందకుమార్ బుధవారం తెలిపారు. నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, తాడేపల్లిగూడెం, యలమంచిలి మండలాల్లో 2,862 మంది రైతులకు చెందిన కూరగాయల తోటలు దెబ్బతిన్నాయన్నారు. యలమంచిలి, ఆచంట మండలాల్లోని లంక గ్రామాల్లో 50 హెక్టార్లలో అరటి తోటలు మునిగిపోవడంతో పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై జబీర్ కథనం మేరకు.. జంగారెడ్డిగూడేనికి చెందిన బాలిక(11) ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన చోడగిరి రాజు అనే వ్యక్తి ఇంటిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి వెళ్లి చూడగా.. స్నానాల గదిలో ఉంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజుపై పోక్సో కేసు నమోదు చేశారు.
పెనుగొండలో ఓ చిన్నారి పెద్ద మనసు చాటుకుంది. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా షాపుల వెంట తిరుగుతూ రూ.3,700 సేకరించింది. తన చిట్టి మాటలతో బాధితులకు ఆహారం, దుస్తులు ఇవ్వాలని కోరింది. చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని ప్రిన్సిపల్ వెంకట అప్పారావు తెలిపారు. చిన్నారి మాటలు ప్రతి ఒక్కరి మనసు కదిలించాయి.
జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఛైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు. అథ్లెటిక్స్ పోటీలను అసోసియేషన్ సెక్రటరీ సంకు సూర్య నారాయణ, అధ్యక్షుడు చింతకాయల సత్య నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్ వరకు వెళ్లిన దండి జ్యోతిక శ్రీని ఘనంగా సత్కరించారు.
దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కష్టజీవులు మరణించడం ఎంతో బాధాకరమని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సొషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముకులు వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేవరపల్లి మండలం చిన్నాయగూడెం జీడిపిక్కల వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన మృతదేహాలను కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వర రావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వ తరఫున రూ.5 లక్షలు, ఫ్యాక్టరీ తరఫున రూ.3 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
నిడదవోలులోని బసిరెడ్డిపేట రేవు వద్ద వినాయక నిమజ్జన సమయంలో చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో <<14072518>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన జాలర్లకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదుచేశారు.
దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.