India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంజాన్ మాసం పురస్కరించుకుని ఆకివీడులోని జామియా మసీదు (చిన్న మసీదు) లో ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి పాల్గొన్నారు. బుధవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం పెద్దలు డాక్టర్ బిలాల్, ఆతిఫ్, ఆరిఫ్, ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.
ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచెన్నాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. అమరావతిలోని అచ్చెన్న కార్యాలయానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానం చేశారు.
ప.గో జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. యలమంచిలో 18 ఎంపీటీసీలకు గాను వైసీపీ 13, జనసేన 1, టీడీపీ 3 చోట్ల గెలిచింది. ఓ సీటు ఖాళీగా ఉంది. అత్తిలిలో టీడీపీకి 5, వైసీపీకి 15 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రెండు చోట్లు ఐదారు మందిని కూటమిలోకి లాగి ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి NDA నాయకులు పావులు కదుపుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించి ఆర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఈ సభలకి హాజరయ్యి ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి అర్జీలు స్వీకరిచి వాటిపై దృష్టిపెడతారు.
తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.
పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.
నాటు సారా వలన కలిగే అనర్థాలను ప్రజలలో విస్తృత అవగాహన కల్పించి, నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా *”నవోదయం” -* నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన గోడ పత్రికను, బుక్లెట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తదితరులు పాల్గొన్నారు.
పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ నుంచి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉన్న రహదారిపై ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు వాహనదారులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతం ఇరుకుగా మారడంతో పాటు భారీ వాహనాల అతివేగం ప్రమాదాలకు కారణమని స్థానికులు అంటున్నారు. నిత్యం ఈ దారిలో ఏదొక వాహన ప్రమాదం జరగడం పరిపాటిగా మారిందంటున్నారు. రహదారి వెడల్పు చేస్తేనే కానీ ప్రమాదాలు తగ్గవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.