India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంటర్ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు<<19653702>> సత్తా చాటారు<<>>. ఫస్ట్ ఇయర్‌లో 16,701 మందికి 12,775 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 15,557 మంది పరీక్షలు రాయగా 12,414 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో ప.గో. జిల్లా రాష్ట్రంలోనే 6వ స్థానంలో నిలిచింది.

పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన అర్జీలను పరిష్కరించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమర్థంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.

ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది 53 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 19,662 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,888 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తరువాత స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా పేరెంట్స్ టీచర్స్ ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఎమ్మెల్యే రామాంజనేయులు, ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు పాల్గొంటారు. కొత్త పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.