India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏటీఎం సెంటరులో ఉన్న సూట్ కేసును చూసిన స్థానికులు బాంబు ఉందంటూ భయపడిన ఘటన ఏలూరులో జరిగింది. పవరుపేటలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం సెంటరులో మంగళవారం రాత్రి సూట్ కేసు ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ఆ విషయం పోలీసులకు చెప్పడంతో బాంబ్ స్క్వాడ్, శునకాలు అక్కడికి చేరుకున్నాయి. తనిఖీ చేసిన అనంతరం సూట్ కేసులో ఏమీలేదని తేల్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 30న వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టర్‌లో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామంలో 200 మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లాలో ఇన్సూరెన్స్ పాలసీల నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి చీటింగ్స్‌కు పాల్పడుతున్న ఇద్దరు కటకటాలపాలయ్యారు. ఈ కేసు వివరాలను కైకలూరు టౌన్ సీఐ కృష్ణ మంగళవారం వెల్లడించారు. యాక్సిడెంట్ కేసులో బాధితులకు క్లైమ్ అందకుండా నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి పోలీసులు, ఆర్టీవో, ఇతర అధికారులను మోసం చేస్తున్న మోహనకృష్ణ (కైకలూరు), అంజనీ కుమార్ (ఏలూరు)ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘X’ వేదికగా మరోసారి స్పందించారు. “నాకు ఇష్టమైతే నేను వస్తా’ ఓ మెగా అభిమానిగా చిరంజీవి, నాగబాబు, పవన్‌ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా! నేను చెప్పదలుచుకున్నదేంటంటే నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక అభిమానిగానే స్పందించా’నని అన్నారు.
భీమవరంలోని 37వ వార్డులో ఉండి రోడ్డు పక్కన జంట కాలువ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా… సీఐ కాళీచరణ్, వీఆర్వో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. డెడ్‌బాడీ పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉందని అన్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు ఫార్మెటివ్ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఓఎంఆర్ షీట్లపై.. 9, 10 తరగతుల విద్యార్థులు పాత విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు.
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మహిళ ఉద్యోగ రీత్యా మస్కట్‌లో నివాసం ఉంటుంది. సోమవారం మస్కట్ నుంచి విజయవాడకు చేరుకుంది. మరికొద్ది గంటలలో స్వగ్రామానికి చేరే సమయంలో గుండెనొప్పితో బస్సులోనే మరణించింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏలూరు నగరంలోని స్థానిక సుంకర వారి తోటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో చంటి అనే వ్యక్తిపై ఏసు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చంటికి గాయాలు కాగా వెంటనే అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రతి ఒక్కరూ మదర్ థెరిసా సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి వారికి సహాయం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పందులు దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆమె జయంతి సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే నూర్జహాన్‌తో పాటు ఆమె భర్త, కో-ఆప్షన్ సభ్యుడు పెదబాబు సైతం వైసీపీకి రాజీనామా చేశారు.
Sorry, no posts matched your criteria.