India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు టి.నరసాపురం మండలంలో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలకు చెందిన నాయకులు బంద్‌కు సహకరించాలని బంధంచర్ల గ్రామంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక హోటల్ యాజమాన్యంతో జరిగిన వాగ్వాదంలో హోటల్ యాజమాని దళిత యువకుడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో గాయాలు పాలైన బాధితుడిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప.గో. జిల్లా ఆచంట మండలం కోడేరులంకకు చెందిన రమేశ్ తూ.గో. జిల్లా పి.గన్నవరం మండలం L.గన్నవరంలో PMPగా వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించాడు. అమ్మాయి తండ్రి రమణకు విషయం చెప్పగా ఒప్పుకోలేదు. దీంతో ఆదివారం వారు ఓ చర్చిలో పెళ్లి చేసుకొని ఇంటికెళ్లారు. విషయం తెలిసిన రమణ మంగళవారం రాత్రి అబ్బాయి ఇంటికెళ్లి కత్తితో దాడి చేసి పారిపోయాడు. రమేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
పొగాకు రైతులు కొందరు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఢిల్లీలో కేంద్ర కామర్స్ మంత్రిని ఎంపీ మహేశ్ ఇటీవల కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసిందని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
వ్యభిచారం ముఠాపై కొవ్వూరు పోలీసులు మంగళవారం దాడి జరిపారు. కొవ్వూరులోని రాజీవ్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో వెళ్లి దాడి చేసినట్లు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శిబిరం నిర్వాహకురాలు లక్ష్మీని అరెస్ట్ చేశామన్నారు. రాజమహేంద్రవరం, వైజాగ్‌కు చెందిన ఇద్దరు యువతలను ఆమె చెర నుంచి విడిపించినట్లు సీఐ పేర్కొన్నారు.
భీమవరం కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖలలో “మీకోసం” ఫిర్యాదులను పరిశీలించే అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మీకోసం వినతుల పరిష్కారం ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించి సరైన పరిష్కారాన్ని అందించాలని ఆదేశించారు.
ఏలూరులోని శనివారపుపేటలో ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహంలో వసతి పొందుతున్న 63 మంది వీధి బాలలు, బిక్షాటన చేయు బాలలు, వివిధ కారణాల వలన తల్లిదండ్రులకు దూరమైన వారు, 7 సంవత్సరాల వయసు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలందరిని పలకరించారు. క్లాస్ రూమ్‌లో పాఠాలు బోధించారు.
మాజీ సీఎం జగన్‌పై ఉన్న కేసుల విచారణ వేగంగా చేపట్టాలంటూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వేసిన పిల్‌పై హైకోర్ట్ ఈరోజు విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులపై విచారణ జరిగింది. తిరిగి పిటిషన్లపై విచారణను హైకోర్ట్ సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.
ద్వారకాతిరుమలలో నాయీ బ్రాహ్మణులకు కళ్యాణ మండపం నిర్మాణ నిమిత్తం స్థలం కేటాయించడంలో జాప్యంపై MRO సుబ్బరావును ఏలూరు ఎంపీ ఆరా తీశారు. స్థలం కేటాయించమని ఆదేశించి 20 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. త్వరగా స్థలం కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
మహిళపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ ఈ నెల 18న పొలంలో పనిచేస్తుండగా మానికల శ్రీను ఆమెను కొట్టి గాయపరిచి అత్యాచారానికి యత్నించాడు. దీంతో మహిళ కేకలు వేడయంతో శ్రీను పారిపోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన MLC నివేదిక ఆధారంగా శ్రీనుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ప.గో జిల్లాలోని ఇసుక నిల్వలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ప్రకటించారు. పెరవలి మండలం ఉసులుమర్రు-5,421 మెట్రిక్ టన్నులు, పెండ్యాల -1,00,948 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు – 35,182 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఒక్కింటికి రూ.265/- చెల్లించి ఇసుక పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.