WestGodavari

News February 6, 2026

రేపు రైస్ మిల్లర్లకు ఎంఎస్‌ఎంఈపై అవగాహన: కలెక్టర్

image

పెదమిరంలోని నిర్మల ఫంక్షన్ హాల్‌లో శనివారం ఈనెల 7 ఎంఎస్‌ఎంఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యజమానులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, యువ నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News February 6, 2026

ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని: జేసీ

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలంటే ప్రజల పూర్తిస్థాయిలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియకు సహకరించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. శుక్రవారం భీమవరం 21వ వార్డు పెద్ద పేట కుసుమ ప్రియ అపార్ట్మెంట్ వద్ద నిర్వహిస్తున్న ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియలో జేసీ స్వయంగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడారు. సర్వేను త్వరితగతం పూర్తి చేయాలన్నారు.

News February 6, 2026

వాడి వేడిగా ఆచంట రాజకీయం (1/2)

image

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తీరుకు దీటుగా వైసీపీ సర్పంచ్‌లు సవాలు విసురుతున్నారు. గతంలో తమపై ఆంక్షలు విధించారన్న అసంతృప్తితో సర్పంచ్‌లు ప్రతిఘటిస్తుండటంతో.. అక్కడ అధికార, ప్రతిపక్షాల నడుమ హోరాహోరీ వాతావరణం నెలకొంది.

News February 6, 2026

ఆచంటలో ఏం జరుగుతోంది (2/2)

image

<<19068550>>ఆచంటలో<<>> రాజకీయం వేడెక్కింది. గతంలో హవా నడిపిన ముగ్గురు వైసీపీ సర్పంచ్‌ల పంచాయతీ రికార్డులపై ఎమ్మెల్యే పితాని దృష్టి సారించారు. పరిపాలనలో ఎమ్మెల్యే పగ్గాలు బిగించడాన్ని జీర్ణించుకోలేని సదరు నేతలు ఇప్పుడు అధికార పక్షంపై ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే తీరును ఎండగడుతుండటంతో రాజకీయ వాతావరణం వాడివేడిగా మారింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇరువర్గాల బలనిరూపణకు వేదికగా నిలవనున్నాయి.

News February 6, 2026

మార్చి 14న జాతీయ లోక్ అదాలత్: జడ్జి సికిందర్

image

తాడేపల్లిగూడెం కోర్టు ఆవరణలో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాష తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మనోవర్తి, గృహహింస, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులతో పాటు బ్యాంకు, టెలిఫోన్ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర పరిష్కారం పొందాలని కోరారు.

News February 6, 2026

ప.గో: వరి రైతులకు ‘ఎలుక గండం’

image

ప.గో. జిల్లాలో రబీ సాగు చేస్తున్న రైతులు ఎలుకల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2.25 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసిన రెండో వారం నుంచే తెగుళ్లు, ఎలుకలు పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్మూలనకు హెక్టారుకు రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. అధికారులు సామూహిక చర్యలు చేపడుతున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు.

News February 6, 2026

ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

image

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.

News February 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

భీమవరంలోని లోసరి రోడ్డులోని విష్ణు కన్వెన్షన్‌లో గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” నిర్వహించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి పన్నులు, పన్నేతర వసూలు, వర్మి కంపోస్ట్ తయారీ, అందుబాటులో ఉన్న ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలు, అంశాలపై సమీక్షించారు. పన్నుల వసూలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.