WestGodavari

News February 4, 2026

అత్తిలి: వివాహితతో అసభ్య ప్రవర్తన.. చివరికి..!

image

ప.గో జిల్లా అత్తిలి మండలం ఈడూరులో ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బింకం చిన్న పండు అనే వ్యక్తి మూడేళ్లుగా వివాహితను ఫోన్‌లో వేధిస్తున్నాడు. గత నెల 22న ఆమె ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భర్త రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News February 4, 2026

తణుకు: పోలీసులపై ఏసీబీ విచారణ?

image

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటర్ వెనుక ఉన్న సూత్రధారులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే CI పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ DSP కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

News February 4, 2026

రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 4, 2026

రబీ సాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రబీ పంటకు సాగునీటి సరఫరాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. సాగునీటి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

News February 3, 2026

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించాలి: కలెక్టర్

image

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆకివీడు మండలం పెదకాపవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో రిజిస్టర్లు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రిజిస్టర్ అవుతున్న కేసుల వివరాలు పరిశీలించారు.

News February 3, 2026

ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

image

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

News February 3, 2026

పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలి: కలెక్టర్

image

ఇంటి, కుళాయి పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం సూచించారు. ఆకివీడు మండలం పెద్దకారులో పైలెట్ ప్రాజెక్టుగా పన్నుల వసూలు జరుగుతోందని తెలిపారు. భూమి ధరలకు అనుగుణంగా పన్నులు పెరిగాయని, గ్రామంలో గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న పన్నులు రూ. 15 లక్షలకు చేరాయని వివరించారు. ఇప్పటివరకు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News February 3, 2026

భీమవరం: బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు.!

image

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు రూ.10వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాలిక దసరా సెలవులకు ఉండి రాగా మేనత్త కుమారుడు నాగాంజనేయులు పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డాడు. వార్డెన్‌కు తెలపడంతో వార్డెన్ ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News February 3, 2026

ఈనెల 5న భీమవరానికి మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 5న భీమవరం రానున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడు చిట్టిరాజు (ఐపీఎస్‌) వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కాళ్ల మండలం పెదమిరం వద్దనున్న రాధాకృష్ణ కల్యాణ మండపానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్‌ కార్యాలయ వర్గాలు పర్యటన వివరాలను వెల్లడించాయి.

News February 3, 2026

ఈనెల 5న ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా: కలెక్టర్

image

వాసవి పెనుగొండ లో ఈనెల 5 నిర్వహించే ఉద్యోగ దిక్చూచి జాబ్ మేళా‌ను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఉద్యోగ దిక్సూచి జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 15 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువ అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులన్నారు. https://naipunyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.