India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఆయన పాల్గొని ప్రజల నుంచి 23 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలతో పాటు సైబర్ మోసాలు, అధిక వడ్డీ వేధింపులపై ఫిర్యాదులు అందాయని తెలిపారు.

భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామ శివారులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

డ్వాక్రా సంఘాల నిధులు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆకివీడుకు చెందిన మహిళలు, ఐద్వా నాయకులు సోమవారం కలెక్టర్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్‌లో వారు మొరపెట్టుకున్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉదయకుమారి మాట్లాడుతూ.. బ్యాంకు అధికారుల అండతో 31 సంఘాలకు చెందిన సుమారు రూ.2,41,34,500 రూపాయలను గోల్‌మాల్ చేశారన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరికి పలు కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,200 కోట్ల సాయం, జిల్లా ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు దక్కాయి. కోకో, కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏలూరు, భీమవరంలో బాలికల హాస్టళ్లు, నరసాపురం క్రోచెట్ లేస్ తయారు చేసే మహిళల కోసం ‘షి’ మార్కెట్లు రానున్నాయి.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా ఈ వారం అర్జీల స్వీకరణ కార్యక్రమం భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. ప్రజలు ఈ మార్పును గమనించి, నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ విన్నపాలను అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.

ఈనెల 2 సోమవారం భీమవరంలోని కలెక్టరేట్ తోపాటు డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అర్జీదారులు అర్జీలను *Meekosam. ap.gov.in* నమోదు చేసుకోవచ్చునని అన్నారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం – బాదంపూడి మధ్య రైల్వే ట్రాక్‌పై జరిగిందని జీఆర్పీ ఎస్సై పి.అప్పారావు ఆదివారం తెలిపారు. మృతునికి 25 – 40ఏళ్ల మధ్య వయస్సు కలిగి, పింక్ కలర్ టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు, నలుపు, తెలుపు రంగు జెర్కిన్ ధరించి ఉన్నట్లు వివరించారు. ఎడమ చేతిపై పచ్చబొట్టు, కుడి మోచేయిపై ఎస్వీ అక్షరాలు ఉన్నాయన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.