India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఇందుకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని డీఆర్వో శివన్నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీతో ఆయన సమీక్షించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

నరసాపురం పట్టణంలోని వశిష్ఠ గోదావరి తీరం లలిత ఘాట్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఈ మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో, సదరు వ్యక్తి రెండు, మూడు రోజుల క్రితమే నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అత్తిలి మండలంలోని ఎర్ర నీలిగుంట గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో పెచ్చేటి శ్రీనివాసరావు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఈ నెల 28న ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగగా, బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు నిఘా పెంచారు. కక్షలు వీడి సామరస్యంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లావ్యాప్తంగా కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ‘స్పర్శ’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి, కుష్టు రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

తాడేపల్లిగూడెంలో <<18993317>>జనసేన రాజకీయంగా దూకుడు పెంచింది<<>>. ఎమ్మెల్యే బొలిశెట్టి , నాయకుడు తోట గోపి పరస్పర సహకారంతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. వీరిద్దరూ నాణేనికి బొమ్మ బొరుసులా వ్యవహరిస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు వైకాపా, టీడీపీలోని అంతర్గత విభేదాలు జనసేనకు కలిసివస్తున్నాయి. ఈ పరిణామాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాడేపల్లిగూడెంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. వైకాపాలో మాజీ మంత్రి కొట్టు సత్యానారాయణ, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం వర్గాల మధ్య విభేదాలు, తాజా సమావేశానికి కొట్టు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అటు టీడీపీలోనూ వలవల బాబ్జి, పసల కొండ వర్గాల నడుమ అసంతృప్తి నెలకొంది. ప్రధాన పార్టీల్లోని ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మలచుకుంటూ జనసేన క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి 9,135 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆమె ఆదేశించారు. గూగుల్ మీట్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య పాల్గొన్నారు.

కాళ్ల మండలం కోపల్లె బ్రిడ్జి వద్ద పనులకు గురువారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని, 6 నెలల కాలంలో ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.