India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అంతర్వేది భీష్మ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పాఠశాలలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ఇచ్చేందుకు డీఈఓ నారాయణ అంగీకరించినట్లు ఫ్యాప్టో నాయకుల తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎంలు, ఎంఈఓలకు సమాచారం అందించి ఈ సెలవును వినియోగించుకోవచ్చన్నారు. తీర్థం వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాప్టో నేతలు విజయరామరాజు, ప్రకాశం, సాయి వర్మ హర్షం వ్యక్తం చేశారు.

నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ చాటారు. లాంగ్‌జంప్‌లో పెంటపాడుకు చెందిన స్నేహలత, రన్నింగ్‌లో మోగల్లు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి శ్రీరామకృష్ణ వర్మ తృతీయ స్థానాలు సాధించి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను SSA అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యాంసుందర్, IE కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభినందించారు.

ఆచంట మండలం వేమవరంలోని పంట కాలువలో గురువారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. పొలాలకు వెళ్తున్న రైతులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటరమణ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతి చెందిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 బార్‌లకు సంబంధించి జిల్లా అబ్కారీ శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సాపురం(1), తణుకు(3), తాడేపల్లిగూడెం(4) మున్సిపాలిటీల పరిధిలోని ఈ బార్‌లకు ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు రావాలని, ఆసక్తి ఉన్నవారు ఎన్ని అప్లికేషన్‌లు అయినా సమర్పించవచ్చని స్పష్టం చేశారు.

కాళ్ల (M) కోపల్లె బ్రిడ్జికి సంబంధించిన పనులను గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పాత బ్రిడ్జిని తొలగించి తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ రోడ్డులో లైట్ వెహికల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హెవీ వెహికల్స్ నేషనల్ హైవే మీదుగానే వెళ్లాలని సూచించారు. ఇటీవల మంత్రులు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారన్నారు.

జిల్లాలో ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 1.31 లక్షల ఎకరాల ఆక్వా విస్తీర్ణంలో ఇప్పటివరకు 66,340 ఎకరాల నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 39,413 ఎకరాల అప్సడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Sorry, no posts matched your criteria.