India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఆక్వా సాగు రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 1.31 లక్షల ఎకరాల ఆక్వా విస్తీర్ణంలో ఇప్పటివరకు 66,340 ఎకరాల నమోదు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 39,413 ఎకరాల అప్సడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనికి అవసరమైన నగదు ఉపసంహరణ తదితర ప్రక్రియలను జనవరి 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 2,24,521 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి పింఛన్ నగదు అందజేస్తారని ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. దీనికి అవసరమైన నగదు ఉపసంహరణ తదితర ప్రక్రియలను జనవరి 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 2,24,521 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి పింఛన్ నగదు అందజేస్తారని ఆమె పేర్కొన్నారు.

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, సహకరించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. బుధవారం ఆమె చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీసీపీఎన్డీటీ కమిటీ సమీక్షలో మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్‌లో బుధవారం వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీలోని మాజీ మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ కొట్టు సత్యనారాయణ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన అనుచరులు సైతం సమావేశానికి దూరంగానే ఉన్నారు. కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి భక్తుల రక్షణార్థం పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, వీడియో ప్రజెంటేషన్ ద్వారా భద్రతా చర్యలను పరిశీలించారు. గోదావరి తీరంలో కళ్యాణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి (30) మృతి చెందినట్లు రైల్వే ఎస్సై అప్పారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారి పడినట్లు సహచర ప్రయాణికులు తెలిపారన్నారు. వారి సమాచారం మేరకు మృతదేహాన్ని బాదంపూడి గేటు వద్ద గుర్తించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామన్నారు.

మొగల్తూరు మండలంలో మూగజీవాల పట్ల ఉన్న భక్తికి నిదర్శనంగా ఒక అరుదైన ఘటన నిలుస్తోంది. సుమారు 33 ఏళ్ల క్రితం పేరుపాలెం సౌత్‌కు చెందిన అందె పూర్ణచంద్రరావు అనే రైతు కొబ్బరితోటలో ఒక ఆంబోతు మృతి చెందింది. ఆ జీవంపై మమకారంతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే దానికి అంత్యక్రియలు నిర్వహించి, అక్కడే ఒక గుడిని నిర్మించి ఆంబోతు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

తాడేపల్లిగూడెం (M) ఆరుగొలను డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి, ఇంటర్, 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.దుర్గారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి 80 సీట్లు, జూనియర్ ఇంటర్ 80 సీట్లు, 6వ తరగతి 13 సీట్లు, 7వ తరగతి 5 సీట్లు, 9వ తరగతి 2 సీట్లు, 10వ తరగతి 10 సీట్లు, సీనియర్ ఇంటర్ 10 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెదఅమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన 144 పనుల్లో కేవలం 27 మాత్రమే పూర్తయ్యాయన్నారు. పురోగతిలో ఉన్న 63 పనులతో పాటు, ప్రారంభించాల్సిన 54 పనులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే ముగించాలని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.