WestGodavari

News December 31, 2024

ప.గో: ‘న్యూఇయర్ వేడుకలను పేద విద్యార్థులతో జరుపుకుందాం’

image

నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని పేద విద్యార్థులతో జరుపుకుందామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసిల్వి, ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌లు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేస్తే వారి చదువులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

News December 31, 2024

ప.గో: న్యూఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు?.. కామెంట్

image

ఉమ్మడి ప.గో జిల్లా ప్రజలు న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు సర్వత్రా న్యూఇయర్ సందడి నెలకొంది. స్వీట్, బేకరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ఈ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ను మీరు ఎలా ప్లాన్ చేశారో కామెంట్ చేయండి.

News December 31, 2024

ప.గో.జిల్లా సీరియల్ నటికి వేధింపులు.. కేసు నమోదు

image

సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. ప.గో.జిల్లా కవిటానికి చెందిన మహిళ(29) కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్‌ షూట్‌లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News December 31, 2024

రేవ్ పార్టీలో ప.గో.జిల్లా వ్యక్తులే కీలకం

image

తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి ప.గో. జిల్లా TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలతో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10 మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.

News December 31, 2024

ఆ పిల్లల దత్తతును ఉపేక్షించం: కలెక్టర్ నాగారాణి

image

అనుమతిలేని పిల్లల దత్తతును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అలా జరిగితే సంబంధిత గ్రామ అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. సోమవారం భీమవరం సమావేశ మందిరం వద్ద కలెక్టర్ అధ్యక్షతన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి కార్యక్రమాల కన్వర్జెన్సీ సమావేశాన్ని సభ్యులైన సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News December 30, 2024

చేబ్రోలు: ఆటో డ్రైవర్ కూతురు CAలో ఉత్తీర్ణత

image

ఏలూరు(D) చేబ్రోలు‌కి చెందిన పుట్టా వీరన్న, శ్రీదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సీఏలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేబ్రోలు, నారాయణపురంలో ప్రాథమిక విద్యాబ్యాసం సాగించిన గీతాంజలి.. ఇంటర్ అనంతరం CAలో ఉచిత సీటు సాధించారు. తండ్రి వీరన్న ఆటో డ్రైవర్‌గా కష్టపడుతూ గీతాంజలిని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. పట్టుదలతో చదివిన గీతాంజలి సీఏ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు. 

News December 30, 2024

2024 ఎలక్షన్స్: ఉమ్మడి ప.గో నుంచి మంత్రి, డిప్యూటీ స్పీకర్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి 13 నియోజకవర్గాల్లో YCP నెగ్గింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 10 చోట్ల TDP, ఐదు స్థానాల్లో జనసేన విజయం సాధించాయి. పాలకొల్లు MLA నిమ్మల రామానాయుడు మంత్రి కాగా, రఘురామకృష్ణరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ కావడం కొసమెరుపు.

News December 30, 2024

దేవరపల్లి: లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

image

దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు.

News December 30, 2024

ఏలూరు: నేడే పోలీస్ ఈవెంట్స్ నిబంధనలు ఇవే..!

image

ఏలూరులో నేటి నుంచి జరగనున్న (PET&PMT) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలను ఆయన వివరించారు. *సీసీ కెమెరాలు, డ్రోన్ ద్వారా పరీక్షలు నిర్వహణ*వైద్య శిబిరం, అంబులెన్సులు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, *ఒక సెట్ జిరాక్స్ కాపీలు*అభ్యర్థి ఒక్కరికి మాత్రమే మైదానంలోకి అనుమతి. *స్నేహితులు, బంధువులకు అనుమతిలేదు

News December 30, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపే మాటలు నమ్మొద్దు..ఎస్పీ సూచన

image

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9550351100 కి తెలపాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.