India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికను వంచించిన ఘటనలో నిందితుడిపై పోక్సో,ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేశామని నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్సీ ధర్మారావు తెలిపారు. పోలీసుల కథనం.. పాలకొల్లుకు చెందిన బాలిక(15)కు నరసాపురానికి చెందిన నయనాల సతీశ్(28) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. సతీశ్ ఆ బాలికను మూడు సార్లు లాడ్జికి తీసుకువెళ్లి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద సోమవారం రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. రాయి విసరడంతో కార్ అద్దం పగిలినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన తప్పులు, పాపాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ధ్వంసమైందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని రూ.14 లక్షల కోట్ల అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోడూరు మండలం వద్దిపర్రు ముంపు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యావసర సరకులు అందించారు.
ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పరకు చెందిన అజ్జా రాజు అనే వ్యక్తి మహిళలపై దాడికి పాల్పడటంతో అతడిని తాళ్లతో బంధించి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాజు సైకోగా మారి ఇలాగే పలుమార్లు దాడులకు పాల్పడడంతో గణపవరం పోలీస్ స్టేషన్‌లో 4 కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో తండ్రి నాగరాజుపై కూడా దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 166.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా పెనుగొండ మండలంలో 21.0, ఇరగవరం మండలంలో 18.2, గణపవరం మండలంలో 14.6, పెంటపాడు మండలంలో 13.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు. జిల్లాలో అత్యల్పంగా కాళ్ల మండలంలో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.
ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి రూ.25.60 లక్షలు మోసపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలూరుకు చెందిన సెల్వా రోజ్లిస్‌కు ఈనెల 18న ఫోన్ కాల్ వచ్చింది. ముంబయి నుంచి CBI అధికారిని మాట్లాడుతున్నా.. మీపై డ్రగ్స్ కేసు నమోదు చేస్తున్నామని బెదిరించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.25.60 లక్షలు ఇవ్వాలని అడిగాడు. అది నమ్మిన సెల్వా భయపడిపోయి మనీ ట్రాన్స్‌ఫర్ చేశారు. తర్వాత ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఏలూరులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప.గో జిల్లాలో గోదావరి వరద కారణంగా సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో జరగాల్సిన మీకోసం కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. SHARE IT..
తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల వద్ద జరిగిన <<13724153>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన పీతల నాగమణి (62) కూతురు విశాలితో కలిసి కారులో నిడదవోలులో ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆరుళ్ల వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి చెట్టును ఢీకొన్నారు. నాగమణి మృతిచెందగా విశాలికి స్వల్ప గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.