India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సైకిల్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పైడి మర్ల సోమిరెడ్డి(70) అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటే క్రమంలో లారీ అతివేగంగా రావటంతో ఈ ఘటనా జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం.
న్యూ ఇయర్ రోజున ఉమ్మడి ప.గో(D)లో పలు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. బైక్‌లు ఢీకొనడంతో భీమవరంలో మహేశ్(18), మరో ప్రమాదంలో ముదినేపల్లిలో వెంకటేశ్వరరావు మృతి చెందారు. రైలు ఢీకొని ఏలూరులో ఓ వృద్ధుడు, మంటలు అంటుకుని టి.నర్సాపురానికి చెందిన సీతారావమ్మ, అతిగా మద్యం తాగి నూతిలో పడి ఏలూరులో శ్రీనివాసరావు, చెరువులో మునిగిపోయి చెరుకువాడలో పెద్దిరాజు మృతి చెందాడు. ఇరగవరంలో వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి.
నూతన సంవత్సర వేడుకలు పశ్చిమగోదావరి జిల్లాలో ఫుల్ కిక్కుతో ముగిశాయి. అయితే ఈ వేడుకల్లో మందుబాబులు మద్యం కోసం బార్లు, మద్యం షాపులకు ఎగబడ్డారు. దీంతో జిల్లాలో మంగళ, బుధ వారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపులలో రూ. 7. 50 కోట్లు విలువచేసే మద్యం కొనుగోళ్లు జరిగాయి. అయితే సాధారణ రోజుల్లో రోజుకు రూ. 2.50 కోట్లు మాత్రమే కొనుగోళ్లు జరిగేవని సమాచారం.
నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.
నూతన సంవత్సర సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అదే విధంగా జిల్లా అధికారులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది మోడల్ గ్రామాలుగా ప్రకటించేలా చొరవచూపాలని కోరారు.
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జేసీ ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ, ప్రభుత్వ పథకాలు అమలులో జేసీని అభినందించారు
కొత్త సంవత్సరం వేళ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘2024కు ధన్యవాదాలు. నా తల్లిని కోల్పోయాననే బాధ అలాగే ఉంది. నిజాన్ని అంగీకరిస్తూ ఆ బాధను మరచిపోయేలా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించా. ప్రతి ఒక్కరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ ఆమె తన భర్త, ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించిన వృద్ధుడికి భీమవరం పోక్సో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించినట్లు భీమవరం రూరల్ SI వీర్రాజు తెలిపారు. భీమవరం మండలానికి చెందిన ఆరేళ్ల బాలికను నరసింహరాజు అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన బాలిక అమ్మమ్మ కిటికి తలుపులో నుంచి చూడగా బాలికతో వృద్దుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొత్త సంవత్సరం వేళ ఓ మాంసం వ్యాపారి భలే ఆఫర్ తీసుకొచ్చారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో కేజీ మటన్ కొంటే.. కేజీ చికెన్ ఫ్రీ అంటూ ఆఫర్ పెట్టారు. దీంతో మాంసం ప్రియులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అలాగే కేజీ చికెన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే కేక్, బిర్యానీ కొన్న వారికి కూల్ డ్రింక్‌నూ ఉచితంగా అందించారు.
Sorry, no posts matched your criteria.