India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలో ఆర్మీ రిక్యూట్‌మెంట్ ర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగవరోజు ర్యాలీ జరుగుతున్న DSA మైదానం బురదగా మారింది. దీంతో రిమ్స్ హాస్పిటల్ రోడ్డులో రన్నింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
వివిధ పార్టీలకు చెందిన MLAలను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈక్రమంలో కడప జిల్లా బద్వేల్ వైసీపీ MLA దాసరి సుధాకు ఆ జాబితాలో చోటు దక్కింది. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. దాసరి సుధ స్పీకర్ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. వైసీపీలో గెలిచిన 11 ఎమ్మెల్యేల్లో ఈమె ఒకరు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డిని సైతం ప్యానల్ స్పీకర్‌గా ఎంపిక చేశారు.
పులివెందులలో ఏడేళ్ల క్రితం జరిగిన అవినీతిపై తిరిగి విచారణ మొదలైంది. పులివెందుల ICDS ప్రాజెక్టు పరిధిలో రూ.8.71 లక్షల విలువైన బియ్యం, పప్పులు, ఆయిల్, ఇతర ఆహార పదార్థాలు దుర్వినియోగం చేశారని 2017లో గుర్తించారు. అప్పడు షోకాజ్ నోటీసులు మినహా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీడీపీవోగా పనిచేసి రిటైర్డ్ అయిన సావిత్రితో పాటు మరో 10 మంది సూపర్వైజర్లపై విచారణకు తాజాగా ప్రభుత్వం ఆదేశించింది.
ప్రముఖ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈనెల 18న కడపకు రానున్నట్టు తెలుస్తోంది. కడపలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాలో నిర్వహించే ముషాయర కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం. 16న పెద్ద దర్గా గంధ మహోత్సవం, 17న ఉరుసు, 18న ముషాయిర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ముషాయిరా కార్యక్రమానికి ఒక అతిధి రావడం ఆనవాయితీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి కడప ఎయిర్ పోర్ట్ నూతన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా కడప నూతన టెర్మినల్ భవన నిర్మాణాలను పటిష్టపరచాలన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పులివెందుల చేరుకున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో తనతో పాటు ఆమె చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేయడానికి డీఎస్పీని కలిసేందుకు ఎదురు చూస్తున్నారు. గతంలో సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన సునీత, తాజాగా ఇక్కడ ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్న కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ ప్రకటనతో పులివెందుల వచ్చారు.
వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కడప MP అవినాశ్ రెడ్డి PA రాఘవ రెడ్డి సూచనలతోనే తాను అసభ్యకర పోస్టులు పెట్టినట్లు వర్రా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. దీంతో రాఘవ రెడ్డిని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజుల నుంచి రాఘవ రెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో ఆయన స్వగ్రామం అంబకపల్లెపై పోలీసులు నిఘా ఉంచారు. పులివెందుల, లింగాల మండలాల్లో ఆయన కోసం గాలిస్తున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో చీఫ్ విప్‌తోపాటు శాసనసభ, మండలి విప్‌లుగా 15 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డిని శాసనసభ విప్‌గా నియమించారు. అయితే TDP నుంచి 15 మందికి, జనసేనలో నలుగురికి చోటు దక్కింది. కాగా BJP నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి మాత్రమే నిలిచారు. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
నిర్దేశించిన ఇసుక పంపిణీ సజావుగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇసుక సరఫరా సంబంధిత అంశాల సమాచారం కోసం 08562246344 అనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఆర్డీవో తమ పరిధిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రతి స్టార్ట్ పాయింట్లో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగానూ.. పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.