Y.S.R. Cuddapah

News August 18, 2025

చాపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

image

చాపాడు మండలం బద్రిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీకింద పడి స్పాట్‌లోనే చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 18, 2025

కడప: జలాశయాల్లో 44.55 TMCల నీటి నిల్వలు

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 44.55 TMCల నీరు నిల్వగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గండికోటలో 20.49 TMCలు, బ్రహ్మసాగర్‌లో 7.26, చిత్రావతిలో 4.96, మైలవరం5.11, పైడిపాలెం4.77, సర్వరాయసాగర్1, వామికొండ సాగర్ 0.96 TMCలు నీరు నిల్వగా ఉంది. బద్వేల్ ట్యాంక్, బుగ్గవంక, లోయర్ సగిలేరు తగినంత నీటితో రైతులకు ఊరట కలిగిస్తున్నాయి.

News August 18, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ భావన

image

భారీ వర్షాలు వరదల వల్ల నదులు వంకలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు DSP భావన సూచించారు. ఆదివారం పొద్దుటూరు అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల రక్షణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్విప్మెంట్ పరిశీలించారు.

News August 17, 2025

మైదుకూరు: వెలుగులోకి బ్రిటీశ్ కాలం నాటి వస్తువులు

image

మైదుకూరు మున్సిపాలిటీ విశ్వనాథపురం గ్రామంలో బ్రిటీశ్ కాలం నాటి 12 టోలాస్ (ఇనుప తూనికరాయి), పిడిబాకు లాంటి వస్తువులు వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర కారుడు బొమ్మిశెట్టి రమేశ్ ఆదివారం తెలిపారు. టోలా అనేది భారతదేశంలో బరువును కొలవడానికి ఉపయోగించే ఒక సాంప్రదాయ సాధనమన్నారు. గతంలో ఎలక్ట్రానిక్ త్రాసులు లేనప్పుడు బంగారం తూకం వేయటానికి ఈ రకమైన బరువును ఉపయోగించేవారని చెప్పారు.

News August 17, 2025

ప్రొద్దుటూరులో కాలేజీ లెక్చరర్ ఆత్మహత్య

image

ఈ ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. టూ టౌన్ సీఐ సదాశివయ్య వివరాల మేరకు.. స్వరాజ్యనగర్‌కు చెందిన పవిత్ర(25) ఎంటెక్ చదివి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఓ వ్యక్తిని ప్రేమించగా వాళ్ల పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. వచ్చే ఏడాదిలో వివాహం చేస్తామని చెప్పారు. ఇంతలో ఏమైందో ఏమో శనివారం ఆమె ఇంట్లోనే ఉరేసుకున్నారు. గమనించిన బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

News August 16, 2025

ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి ఖైదీ పరార్.. DIG విచారణ.!

image

ప్రొద్దుటూరు సబ్ జైల్ నుంచి రిమాండ్ ఖైదీ మహమ్మద్ పరారీపై జైళ్ల శాఖ డీఐజీ రవికుమార్ విచారణ చేపట్టారు. ఆ ఘటనపై శనివారం ప్రొద్దుటూరు సబ్ జైలుకు వచ్చారు. ఇక్కడి జైలర్, సిబ్బందిని విచారించారు. అనంతరం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. DIG వెంట కడప జిల్లా జైలర్ అమర్ ఉన్నారు. స్థానిక డీఎస్పీ భావన సీఐలు, ఎస్ఐలతో కలిసి జైలు ప్రాంగణాన్ని, ప్రహారీ గోడను పరిశీలించారు.

News August 16, 2025

కడపకు ప్రథమ స్థానం

image

APSPDCL పరిధిలో కడప జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఆ సంస్థ సీఎండీ సంతోష్ రావు చేతుల మీదుగా కడప ఎస్ఈ రమణ ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు మెరుగైన సేవలు, వాట్సప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డు అందించారు.

News August 16, 2025

గండి క్షేత్రానికి వర్తించని ఫ్రీ బస్ పథకం

image

శ్రావణమాస 4వ శనివారం సందర్భంగా గండి అంజన్న క్షేత్రానికి ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. నిన్న ప్రభుత్వం స్త్రీ శక్తి(ఫ్రీ బస్) పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ ఆలయానికి వెళ్లేందుకు మహిళలు ఆసక్తి చూపారు. అయితే ఈ బస్సులపై ‘స్త్రీ శక్తి పథకం వర్తించదు’ అనే బోర్డు చూసిన మహిళలు నిరాశకు గురయ్యారు. స్పెషల్ బస్సులకు వర్తించదని RTC ముందే ప్రకటించింది. ఈ విషయం తెలియని మహిళలు నిరాశకు లోనయ్యారు.

News August 16, 2025

ప్రొద్దుటూరు జైలు నుంచి దొంగ పరార్

image

ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్ జిల్లా దొంగ మహమ్మద్ రఫీ శనివారం పరారయ్యాడు. ఇటీవల రాజుపాలెంలో పట్టపగలు దొంగతనం చేస్తూ అడ్డువచ్చిన ఇంటి యజమాని తల పగలగొట్టాడు. మూడు రోజుల క్రితం రాజుపాలెం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి అతను పరారయ్యాడు. కడప, కర్నూల్, అనంతపురం తదితర జిల్లాల్లో దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.

News August 16, 2025

కడప జిల్లా యువకుడికి CGC మెడల్

image

పాకిస్థాన్‌కు చిక్కుకున్న మన దేశ జాలర్లను 2024 నవంబర్‌లో భారత నేవీ సిబ్బంది సాహసోపేతంగా రక్షించిన విషయం తెలిసిందే. ఆ నేవీ దళంలో కడప జిల్లా కలశపాడు మండలం కొండపేటకు చెందిన పాలకొలను నారాయణరెడ్డి, వీరమ్మ కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా CGC(Conspicuous Gallantry Cross) మెడల్ అందించాలని ఆదేశించారు.