India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల 10 రోజుల్లో టీటీడీ 3.20 లక్షల మందికి నిత్యాన్నదానం అందించినట్లు మంగళవారం అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. మార్చి 27న 30,700, 28న 22,900, 29న 23,900, 30న 22,300, 31న 26,500, ఏప్రిల్ 1న అన్నప్రసాదాలు 40 వేలు, కల్యాణోత్సవం సందర్భంగా గ్యాలరీలలో 85 వేల మంది, ఏప్రిల్ 2న 23,500, 3న 18,450, 4న 15,350, 5న 11,400 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారని పేర్కొన్నారు.

జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఏప్రిల్ 08, 09 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల నివేదికలు ఉంటే తీసుకురావాలని సూచించారు. అక్రెడిటేషన్ కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,060
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,855
*వెండి 10 గ్రాముల ధర రూ.2,380

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్వహణకు 2730 పోస్టులను (ఉద్యోగులను) మంజూరు చేశారు. ప్రొద్దుటూరుకు అదనంగా మరో 2 కోర్టులు మంజూరయ్యాయి. VIIIవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు, Iవ అదనపు సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే కోర్టులకు సిబ్బందిని, ఫర్నిచర్‌ను, లైబ్రరీని మంజూరు చేశారు.

కడప జిల్లాలో చిరుత పిల్లను కుక్కలు చంపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దువ్వూరు మండలం చిన్నబాకరపురం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి వచ్చిన ఒక చిరుత పిల్లపై గ్రామంలో తిరిగే కుక్కలు గుంపుగా దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి మృతి చెందింది. గమనించిన స్థానిక రైతులు వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

‘డెకాయిట్’ సినిమా కోసం తాను మదనపల్లె యాసను సాధన చేసినట్లు నటుడు అడివి శేష్ అన్నారు. ఆయన కొత్త సినిమా డెకాయిట్. సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ హీరోయిన్. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పోషించిన హరి పాత్ర తనపై ఎంతో ప్రభావం చూపించిందని, ఇంట్లో కూడా తాను మదనపల్లె యాసలో మాట్లాడేవాడిని అని ఆయన పేర్కొన్నారు. మరి ఈ సినిమాలో మదనపల్లె నేపథ్యం ఏమన్నా ఉందా అన్న విషయం ఏప్రిల్ 10న తేలనుంది.

ఇంటర్నెట్‌లో తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రైల్వే కోడూరు MLA శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ఓ మహిళ తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాతోపాటు ఛానళ్లలో వైరల్ అవుతున్నాయని, ఇవి తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయన్నారు. వీటిని ప్రసారం చేయకుండా చూడాలని ఆయన తరుఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. దీనిపై వివరాలు ఇవ్వాలని న్యాయమూర్తి కోడూరు పోలీసులను ఆదేశించారు.

కడప జిల్లాలోని ప్రభుత్వ రంగంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 8,323.926 MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఇక్కడ 5X210MW, 1X600MW విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా విద్యుత్ ఉత్పత్తి వివరాలు(MUలో).
☛ U1 – 1062.648
☛ U2 – 1010.066
☛ U3 – 1080.999
☛ U4 – 972.7590
☛ U5 – 1016.253
☛ U6 – 3181.201MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
Sorry, no posts matched your criteria.