India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జలధార కార్యక్రమంలో భాగంగా కడపలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు అమలయ్యే ఈ ప్లాన్ ద్వారా నీటి భద్రత, సాగునీటి పొదుపు, డ్రిప్ సాగు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం వంటి అంశాలను పటిష్టం చేయాలన్నారు. నీటి సంరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు సోమవారం 114 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చట్ట పరిధిలో వారికి న్యాయం చేస్తామని తెలిపారు.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,070
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,864
* వెండి 10 గ్రాముల ధర రూ.2,385.

జిల్లాల పునర్వ్యవస్థీకరణతో సరిహద్దుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 7 జిల్లాల సరిహద్దులు కలిగిన ఏకైక జిల్లాగా కడప జిల్లా నిలిచింది. అన్నమయ్య జిల్లా మార్పులతో రూపురేఖలు పూర్తిగా మారాయి. కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి విలీనం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరడంతో కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి. భౌగోళికంగా కడప జిల్లా కేంద్ర స్థానంలో ఉండటంతో ప్రాధాన్యం పెరిగింది.

కడప రిమ్స్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్‌పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

☞ మద్యం అమ్మకాల ద్వారా రూ.1,151.81 కోట్లు ☞ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.278.05 కోట్లు ☞ రవాణా శాఖ ద్వారా రూ.195.21 కోట్లు ☞పట్టణాల్లో ఇంటి పన్ను రూ.99.40 కోట్లు ☞ GST వసూళ్ల ద్వారా రూ.68.40 కోట్లు ☞ పట్టణాల్లో నీటి పన్ను రూ.16.95 కోట్లు ☞ AMCల ద్వారా రూ.13.37 కోట్ల ఆదాయం లభించింది.

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించింది. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీఓ, పులివెందుల, బద్వేల్, రాజంపేటలో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు, పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.

వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి క్షేత్రం వద్ద నది ప్రమాదాలకు నిలయంగా మారిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతంలో ఇప్పటికే ఎందరో మృత్యువాత పడ్డారని ప్రజలు తెలుపుతున్నారు. ఆ ప్రాంతంలో ఒక సూచిక బోర్డు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు.

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
Sorry, no posts matched your criteria.