India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ MLA రాచమల్లుపై శుక్రవారం సాయంత్రం ప్రొద్దుటూరు 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాల్మీకి సంక్షేమ సంఘం డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, స్థానిక టౌన్ బ్యాంక్ ఛైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డిలు సీఐ వేణుగోపాల్‌కు ఈ ఫిర్యాదు అందించారు. CM చంద్రబాబు, హిందూపురం MLA బాలకృష్ణ, TDP కార్యదర్శి కొండారెడ్డి, మాజీ MLC పుల్లయ్యలపై రాచమల్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

కడప జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల (ఎస్‌సీటీపీసీ) శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన తరగతి గదులు, వసతి గదులు, కార్యాలయాలు, మైదానం, పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రకాశ్ బాబు, డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.

ఇటీవల ఎంపికైన కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభం కానుంది. ఈక్రమంలో కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. వసతి, తరగతి గదులు, మైదానాన్ని చెక్ చేశారు. అనంతరం మొక్కల నాటి నీరు పోశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) ప్రకాశ్ బాబు, ఇతర ఉన్నత అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్లతోటల పెంపకానికి 100% రాయితీ ఇస్తున్నామని కడప జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషారెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద మామిడి, జామ, నిమ్మ పంటలు సాగు చేసుకోవచ్చన్నారు.

యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకుడు డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ ఇంటర్మీడియట్ విద్యార్థులు దీనికి అర్హులు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్షిటీని సంప్రదించాలన్నారు.

కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరిలో అక్టోబర్ 7వ తేదీన గిరిప్రదక్షణ జరగనుంది. సంబంధిత కరపత్రాలను పుష్పగిరి తీర్థయాత్ర ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు సట్టి భారవి సిద్ధవటం జ్యోతిక్షేత్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఇడుపులపాయలోని IIIT విద్యార్థులకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అన్ని క్యాంపస్ విద్యార్థులకు ఈ తేదీల్లోనే సెలవులు ఉంటాయి. స్వగ్రామాలకు వెళ్లడానికి విద్యార్థులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కడప మేయర్ సురేశ్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని ప్రతివాదిగా ఉన్న MLA రెడ్డప్ప మాధవి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప కార్పొరేషన్ కమిషనర్, రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులే దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. వాళ్లు పోలీసులకే సహకారం అందిస్తున్నారని విమర్శించారు. పోలీసుల మీద పోలీసులే విచారిస్తే న్యాయం జరగదన్నారు.

జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు జీఎస్టీ గురించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.