India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,060
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,855
*వెండి 10 గ్రాముల ధర రూ.2,335

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను డిమాండ్ రూ.175.56 కోట్లు కాగా.. మార్చి 31 నాటికి రూ.99.40 కోట్లు(56.62%) వసూలైంది. మున్సిపాలిటీ వారీగా (రూ. కోట్లలో).
*కడప-110.41-58.79(53.24%)
*ప్రొద్దుటూరు-36.10-21.04(58.28%)
*పులివెందుల-11.48-7.54(65.65%)
*జమ్మలమడుగు-5.95-4.21(70.83%)
*ఎర్రగుంట్ల-5.43-2.65(48.89%)
*మైదుకూరు-5.00-2.47(49.44%)
*కమలాపురం-1.18-0.59(49.86%)

కొండాపురం రైల్వే స్టేషన్ శివారులోని పంపు హౌస్- చిత్రావతి రైల్వే బ్రిడ్జి మధ్యలో గురువారం ఉదయం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మృతిడి తల మొండెం వేరు వేరు అయ్యి ట్రాక్ పైన పడినట్లు పేర్కొన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు కడప జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.

కడప జిల్లా పరిధిలో 38 మంది ITI(ఎలక్ట్రీషియన్) చదవకుండానే పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పించి, జాబ్‌లో చేరినట్లు విచారణలో వెల్లడైందని APSPDCL CMD శివశంకర్ వివరించారు. కడప పరిధిలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన 38 మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు సహా పలు జిల్లాలలో జరిగిన విచారణలో ఈ అనర్హ నియామకాలు బయటపడ్డాయని తెలిపారు.

కడప YVU పీజీ కళాశాల కామర్స్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి (కంప్యూటర్ సైన్స్) /ఎం.సి.ఎ./ ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాలన్నారు. నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలన్నారు.

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్ట ప్రాంతాలను వీక్షించారు. భవిష్యత్లో ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించేందుకు చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారని సంబంధిత అధికారులు తెలిపారు.

కడప జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నిటిలో ఎలక్షన్ వార్డులు పెరగనున్నాయి. దీంతో కౌన్సిలర్ల సంఖ్య కూడా పెరగనుంది. జిల్లాలో 44 మంది కౌన్సిలర్లు పెరగనున్నారు. ప్రొద్దుటూరులో 41 నుంచి 52, పులివెందులలో 33 నుంచి 40, బద్వేల్ లో 35 నుంచి 40, రాజంపేటలో 29 నుంచి 32, మైదుకూరులో 24 నుంచి 32, జమ్మలమడుగులో 25 నుంచి 32, ఎర్రగుంట్లలో 27 నుంచి 28, కమలాపురంలో 20 నుంచి 23కు కౌన్సిలర్ల సంఖ్య పెరగనుంది.

Sorry, no posts matched your criteria.