India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,155.81 కోట్ల మద్యం తాగేశారు. 16,00,494 కేసుల IML మద్యం, 8,51,147 కేసుల బీర్లు గుటగుట తాగేశారు. నెలకు సరాసరిన రూ.95.98 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 14,83,675 కేసులు IML మద్యం, 5,10,320 కేసులు బీర్లు అమ్ముడుపోయాయి. రూ.1,169.50 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి.

కడప విద్యుత్ సర్కిల్ (SE) పరిధిలో మార్చి నెలలో విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నెలకు 427.112 MU కోటా కాగా.. మార్చి 30 వరకు 484.178MU వినియోగం జరిగింది. డివిజన్ వారీగా విద్యుత్ కోటా, వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప-43.410-70.587 MU
➤ పులివెందుల-72.270-82.467 MU
➤ ప్రొద్దుటూరు-136.890-117.650 MU
➤ మైదుకూరు-59.169-82.462 MU
➤ రాజంపేట-62.576-75.763 MU
➤ రాయచోటి-52.806-55.249 MU.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, టీటీడీ జేఈవో వీ.వీరబ్రహ్మం మంగళవారం పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రేపు సాయంత్రం 6-30 గంటల నుంచి 8-30 గంటలకు వరకు జరుగనుంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు కోసం టీటీడీ సాయంత్రం నుంచి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వనున్నారు.

కడప సర్కిల్ విద్యుత్ శాఖ SPDCL సూపరింటెండెంట్ ఇంజినీర్ (SE) రమణకు చీప్ ఇంజినీర్(CE)గా అడహక్ ప్రమోషన్ ఇచ్చారు. పదోన్నతిపై ఆయనను తిరుపతి కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ మేరకు మంగళవారం SPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప SEగా సోమా శ్రీనివాసులును నియమిస్తున్నట్లు సమాచారం.

కడప జిల్లా తొండూరు (M) మల్లేలలో మంగళవారం రాత్రి తల్లీకూతురు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన షేక్ బీబీ(58), షేక్ ఇమాంబి(35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని కనిపించారు. షేక్ బీబీ భర్త షేక్ ఇమామ్ బాషా ఇంట్లో కనిపించడం లేదు. అప్పుల బాధతో కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మైదుకూరు-ప్రొద్దుటూరు రోడ్డులోని రెవెన్యూ కాలనీలో బాల కుమార్, లక్ష్మీనారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 3వ కుమారునికి 2 నెలలు మాత్రమే. ముగ్గురు పిల్లలు కావడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని తన భార్యను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి బాలుడిని అమ్మేశాడు. రూ.50 వేలకు కుమారుడిని అమ్మినట్లు తల్లి నారాయణమ్మ ICDS అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.