India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ముంతాజ్ బేగం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 41వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా పనిచేస్తున్నారు.

ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా పండుగ సమయంలో ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.35, పిల్లలకు రూ.25గా పేర్కొన్నారు. ఇక పార్కింగ్ ఫీజు టూ వీలర్‌కు రూ.10, ఫోర్ వీలర్‌కు రూ.20లుగా నిర్ణయించారు.
NOTE: GST అదనం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడలో మాట్లాడారు. ‘వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు. ఆయనకు సభా హక్కుల నోటీసు ఇస్తాం. హంతకులతో కుమ్మక్కైన శంకరయ్యపై విచారణ జరిపి డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. వివేకా హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకయ్య ఏం చేశాడని ప్రశ్నించారు.

కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి హత్య సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డిని పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన నుంచి అప్పులు తీసుకున్న వారే హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

కడప కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని MLA మాధవి రెడ్డి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణ తర్వాత మేయర్ పదవి నుంచి ఆయనను తప్పించారు. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లగా మరోసారి ఆయన వాదనలు వినాలని సూచించింది. ఈనెల 17న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి సురేశ్ బాబు తన వాదన వినిపించారు. సంతృప్తి చెందని అధికారి మేయర్‌పై అనర్హత వేటు వేశారు.

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలలో అక్టోబర్ రెండు నాటికి స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం JC అతిధి సింగ్‌తో కలిసి స్మార్ట్ కిచెన్ల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేపట్టారు. స్మార్ట్ కిచెన్లు అన్ని మండలాల్లో ఓకే డిజైన్‌లో ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా, రుచికరంగా అందించాలన్నారు.

ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను జిల్లా రాజకీయ నేతలు మర్యాదపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు కలిశారు. వారంతా జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రవీంధ్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు ఉన్నారు.

మైదుకూరులో 11 రోజులు అమ్మవారి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ మేరక ఆయనకు ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మైదుకూరు ఉపాధ్యక్షుడు దొంతు వెంకటసుబ్బయ్య, సెక్రటరీ అశోక్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ గురువారం విజయవాడలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కడపలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి విజయవాడకు బస్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులంతా బుధవారం ఉదయం 6 గంటలకు తమ గుర్తింపు కార్డుతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు రావాలని డీఈవో శంషుద్దీన్ సూచించారు.

కడప జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు గౌరవ హోదా లభించింది. ప్రొద్దుటూరు, బద్వేల్ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధను అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణరాజు ఈ మేరకు ప్రకటన చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు అందుబాటులో లేనప్పుడు వీళ్లు స్పీకర్ స్థానంలో ఉండి అసెంబ్లీని నడిపిస్తారు.
Sorry, no posts matched your criteria.