Y.S.R. Cuddapah

News March 4, 2025

కడప జిల్లాలో TODAY TOP NEWS

image

☛ పేదరికంలో కడప జిల్లాకు 12వ స్థానం
☛ కడప: ప్రేమ పేరుతో మోసం
☛ మారనున్న గండికోట రూపురేఖలు
☛ బోల్తాపడ్డ జమ్మలమడుగు డిపో బస్సు
☛ కడపలో TDP కార్యకర్త ఆత్మహత్యాయత్నం
☛ మాకు ఇంకా రూ.350 కోట్లు కావాలి: ఎమ్మెల్యే ఆది
☛ చక్రాయపేట: మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
☛ చక్రాయపేట: భర్త కువైట్‌కు వెళ్తున్నాడని భార్య ఆత్మహత్య

News March 4, 2025

మారనున్న గండికోట రూపురేఖలు

image

కడప జిల్లాలోని పర్యాటక కేంద్రాల్లో గండికోట ఒకటి. ఇప్పటికే గండికోట అభివృద్దికి రూ.77.0 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. త్వరలో రూ.2500 కోట్ల వ్యయంతో ఇక్కడ 40 ఎకరాల్లో రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క అభివృద్ది పనులు, మరోవైపు ఈ రిసార్టులు పూర్తయినట్లయితే రాష్ట్రంలోనే మొదటి స్థానంలో గండికోట పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోందని పలువురు అంటున్నారు.

News March 4, 2025

పేదరిక జిల్లాల లిస్ట్‌లో YSR జిల్లాకు 12వ స్థానం

image

సోషియో ఎకనామిక్ సర్వే తెలిపిన లెక్కల ప్రకారం.. అత్యంత పేద జిల్లాల లిస్ట్‌లో YSR జిల్లా 12వ స్థానంలో ఉంది. ఈ జిల్లా హెడ్‌కౌంట్ రేషియో 3.34%గా ఉండగా.. తీవ్రత విషయంలో 38.51%గా ఉంది. MPB స్కోర్ యాత్రం 0.013గా ఉంది. అతి తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదట ఉంది. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి.

News March 3, 2025

పెండ్లిమర్రి: మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

image

పెండ్లిమర్రి మండలం గంగనపల్లి గ్రామం మాలవాడలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను కడతేర్చిన ఘటన గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. సుబ్బరాయుడు తన భార్య లూర్థ్ మేరీని మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పెండ్లిమర్రి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News March 2, 2025

బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షుడు మృతి

image

కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు, TDP నాయకుడు పోతుగంటి పీరయ్య శనివారం మృతి చెందారు. ఆయన శుక్రవారం ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల TDP శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

News March 2, 2025

టీడీపీ నేత పీరయ్య మృతి బాధాకరం: నారా లోకేశ్

image

కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య మృతి చెందారన్న వార్త తనను ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కుటుంబానికి టీడీపీ అండగా నిలుస్తుందని శనివారం Xలో తెలిపారు.

News March 1, 2025

ఎగుమతి పెంచేందుకు కృషి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో పారిశ్రామిక, ఉద్యాన పంటల ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు.

News March 1, 2025

సిబ్బంది సమస్యల పరిష్కారమే ధ్యేయం: కడప SP

image

కడప జిల్లాలో పోలీసు శాఖలో సిబ్బంది సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు ఎస్పీ అశోక్ శుక్రవారం స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఉన్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి పరిష్కరించాలన్నారు.

News February 28, 2025

బద్వేలులో గంజాయి స్వాధీనం

image

బద్వేలులో పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు.

News February 28, 2025

వెలుగులోకి ఆదిమానవుని 12 శాసనాలు

image

లంకమల అభయారణ్యంలో లభ్యమైన 4 నుంచి 8వ శతాబ్దం కాలం నాటి ఆదిమానవుల 12 శాసనాలను భారతదేశ పురావస్తుశాఖ ఎపిగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు బీటు కణతి గుండం, గోపాలస్వామి కొండ పరిసర ప్రాంతాలను గురువారం ఆదిమానవుల రేఖా చిత్రాలపై 6 మంది సభ్యుల బృందం పరిశోధన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ కళావతి పాల్గొన్నారు.