Y.S.R. Cuddapah

News October 29, 2024

నేడు కడప జిల్లాకు YS జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

YS జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా 10:45 ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. మూడు రోజులపాటు జగన్ జిల్లాల పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.

News October 29, 2024

కడప: వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు ఇంటర్వ్యూలు

image

వైవీయూ పీజీ కళాశాలలో కామర్స్, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం నవంబర్ 4వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రఘునాథ్ రెడ్డి తెలిపారు. కామర్స్ సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి ఎంకాం, కాంపిట్యూషనల్ డేటా సైన్సెస్ సబ్జెక్టులకు ఎమ్మెస్సీ, పీహెచ్డీ/ నెట్/ సెట్ అర్హత ఉండాలన్నారు. అన్ని రకాల ఒరిజినల్ అర్హత పత్రాలతో రావాలని సూచించారు.

News October 29, 2024

చాపాడు కాలువలో పడి బాలుడు మృతి

image

రాజుపాలెం గ్రామానికి చెందిన ఆదిల్(11) అనే బాలుడు చాపాడు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆదిల్ మృతదేహం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటరమణ తెలిపారు.

News October 28, 2024

కడప: రోకలి బండతో అత్తపై దాడి.. జైలు శిక్ష

image

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో అత్తను రోకలి బండతో కొట్టి గాయపరిచిన కేసులో ముద్దాయికి 1 సంవత్సరం జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. 2022 సంవత్సరంలో నెహ్రూ నగర్‌లో నివాసం ఉంటున్న బాధితురాలిపై రోకలి బండతో దాడి చేసి గాయపర్చిన నిందితుడు శ్రీనివాసులుపై అప్పట్లో కేసు నమోదైంది. విచారణ చేసిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో సోమవారం 2వ అదనపు జడ్జి శిక్ష ఖరారు చేశారు.

News October 28, 2024

రేపు పులివెందులకు వైఎస్ జగన్ రాక

image

మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పులివెందులకు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గం.కు పులివెందుల చేరుకోనున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక అక్కడి నుంచి 11:40 గం.కు ఆయన ఇంటికి వెళతారని పేర్కొంది.

News October 28, 2024

రూ.20 కోట్లతో కడప స్టేషన్ అభివృద్ధి

image

ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను రూ.20 కోట్లతో ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్‌గా శంకుస్థాపన చేయడంతో పనులు జోరుగా జరుగుతున్నాయి.

News October 28, 2024

రాజంపేట: చికెన్ ముక్క ఇరుక్కుని బాలుడి మృతి

image

రాజంపేటలో విషాద ఘటన జరిగింది. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు కూలీ పని నిమిత్తం రాజంపేటకు వలస వచ్చారు. పట్టణంలోని మన్నూరు సాతవీధిలో జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. సుశాంక్(2) పచ్చి చికెన్ ముక్క నోట్లో వేసుకున్నాడు. ఈక్రమంలో ఊపిరాడక మృతిచెందాడు.

News October 28, 2024

నేరాల కట్టడిలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: కడప ఎస్పీ

image

నేరాలను నిరోధించడంలో, నేరస్థులను గుర్తించి అరెస్ట్ చేయడంలో CC కెమెరాల పాత్ర కీలకమైనదని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులకు కడప పోలీసు కార్యాలయంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వ్యాపారులు తమ వంతు సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ సూచించారు.

News October 28, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌ అదితి సింగ్ తెలిపారు. నేటి ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలపాలన్నారు.

News October 27, 2024

వేంపల్లెలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న షేక్ సానియా అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీకి వెళ్ళమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై, ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచేసింది.