India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలో ఆటోలకు నూతనంగా కేటాయించిన పోలీసు సర్టిఫికెట్ PC నంబర్ సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. కడప పరిధిలోని శంకరాపురానికి చెందిన నాగరాజు ఆటోలో బ్యాగ్ మర్చిపోయాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి తాను ఎక్కిన ఆటో PC నంబర్ వారికి చెప్పాడు. వెంటనే ట్రాఫిక్ సీఐ జావేద్ నేతృత్వంలో ఆటోను వెంటనే కనుగొన్నారు. బాధితునికి ఆటో డ్రైవర్ ద్వారా పోగొట్టుకున్న బ్యాగ్ అందజేశారు. బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా.. వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తులో విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపారు.
కొడుకు బుడిబుడి అడుగులు వేస్తే తండ్రికి ఆనందం. అదే కొడుకు తండ్రి కళ్లెదుటే చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇటువంటి ఘటన వేంపల్లి-రాయచోటి రహదారిపై శనివారం జరిగిన విషయం తెలిసిందే. వీరపునాయుని పల్లె మండలం మొయిలచెరువుకు చెందిన బాలగంగాధర్, రమణారెడ్డి బైక్‌పై చక్రాయపేటకు వెళుతుండగా.. ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలగంగాధర్ అక్కడికక్కడే చనిపోగా.. రమణారెడ్డికి కాలు విరిగింది. ఈ ఫొటో అందరిని కలిచివేస్తోంది.
కడపకు చెందిన బాలుడిపై కృష్ణా జిల్లాలో అత్యాచారం కేసు నమోదైంది. ఎస్సై సందీప్ వివరాల మేరకు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఓ కాలేజీలో బాలిక, కడపకు చెందిన బాలుడు ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
కలసపాడు మండలం పుల్లారెడ్డి పల్లెలో ఓ ఇంట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గురయ్య సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీలో శుక్రవారం విధులు పూర్తి చూసుకుని బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. పిడుగుపల్లె వద్ద టెలిఫోన్ కేబుల్ కోసం తవ్విన గుంత వద్ద అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయమవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి ఏప్రిల్‌లో వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కడప నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జావేద్ తెలిపారు. ఈ మేరకు కడపలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను సమీక్షించారు. రాబోయే రోజుల్లో డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరాతీశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు తక్షణం స్పందించి వారికి న్యాయం జరిగేలా చూడాలని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను ఆదేశించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాల విక్రాయలపై నిఘా ఉంచి దాడులు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎవరైనా అక్రమంగా టపాసుల అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలను సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
పులివెందులలోని తన నివాసంలో గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఫిర్యాదుల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
కడప జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా నియమితులైన మీనాక్షి దేవిని నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మవరం డిప్యూటీ ఈఓగా ఉన్న మీనాక్షి దేవిని ప్రొద్దుటూరు డిప్యూటీ ఈఓగా బదిలీ చేశారు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారిగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కడప డీఈఓగా ఉన్న అనూరాధను విద్యాశాఖలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Sorry, no posts matched your criteria.