Y.S.R. Cuddapah

News March 21, 2025

కడప MP అవినాశ్‌కి కీలక బాధ్యత.!

image

పార్లమెంట్ ఎస్టిమేట్ (అంచనాల) కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ అంచనాల కమిటీ పార్లమెంటులో అత్యున్నతమైన కమిటీ. దేశం మొత్తం మీద 543 పార్లమెంట్ సభ్యుల నుంచి 30 మందిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా.. వైఎస్సార్సీపీ నుంచి కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు YS అవినాశ్ రెడ్డి ఎన్నికవ్వడం చాలా సంతోషమని కార్యకర్తలు తెలిపారు.

News March 21, 2025

ALERT: కడప జిల్లాకు వర్ష సూచన

image

కడప జిల్లాలో ఆదివారం వర్షం పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడప జిల్లాలతో పాటు అల్లూరి, మన్యం, నంద్యాల, పల్నాడు(D) జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల కింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

News March 21, 2025

GATE-2025 ర్యాంకుల్లో ఆర్జీయూకేటీ విద్యార్థుల ప్రతిభ

image

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు IIT Roorkee నిర్వహించిన GATE – 2025 పరీక్షల్లో ప్రతిభ చూపుతూ అద్భుత ర్యాంకులు సాధించారు. వీరిలో 30 మందికి పైగా విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. గేట్ ర్యాంకులు సాధించి విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంచిన విద్యార్థులను వీసీ అభినందించారు.

News March 20, 2025

23న వేంపల్లెకి రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీన వేంపల్లె పట్టణానికి రానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చి అనంతరం వేంపల్లెలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరుకి వెళ్తారని అధికారిక సమాచారం అందింది.

News March 20, 2025

వైవియూ దూరవిద్య కోర్సుల ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: యోగి వేమన యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ద్వారా పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ కె. కృష్ణారెడ్డి తెలిపారు. వైవీయూ అధ్యయన కేంద్రాల్లో ఎం.ఏ. ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, తెలుగు, ఎం.కామ్. కోర్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్. రఘునాథరెడ్డి, రిజిస్ట్రార్ పద్మ పాల్గొన్నారు.

News March 19, 2025

కడప ZP ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

image

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27వ తేదీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామాతో ఇన్‌ఛార్జి జడ్పీ ఛైర్మన్‌గా శారద కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపైన ఆసక్తిగా మారింది.

News March 19, 2025

జ్యోతి క్షేత్రమును సందర్శించనున్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి బుధవారం శ్రీ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రమును సందర్శించనున్నారు. జ్యోతి క్షేత్రములో కాశినాయన స్వామిని దర్శించుకొని అనంతరం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన వసతి భవనాలను, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పునఃనిర్మించిన భవనాలను పరిశీలించనున్నారు.

News March 18, 2025

కడప జిల్లాకు మరోసారి పేరు మార్పు

image

ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ‘కడప’ పేరు మరోసారి మారింది. ఇక నుంచి YSR కడప జిల్లాగా పరిగణించాలని కూటమి ప్రభుత్వం కేబినేట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా అయిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంలో కడపను తొలగించి YSR జిల్లాగా మార్చారు. కడపను మళ్లీ కలిపి YSR కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోమారు జిల్లా పేరు మార్పుపై మీ కామెంట్ తెలపండి.

News March 18, 2025

ఎర్రగుంట్లలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం

image

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని కడప రోడ్డులోని మై హోమ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాన్ని వెనుక నుంచి వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన గండులూరి ఖాదరయ్య(41) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2025

పెండ్లిమర్రి: నేడు నరసింహస్వామికి విశేష పూజలు

image

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేయి నూతుల కోనలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నేడు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో తెల్లవారుజామునే స్వామి వారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.