India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప నగరంలోని డాక్టర్ వైయస్సార్ క్రీడా పాఠశాలలో ఈనెల 23వ తేదీన జిల్లా స్థాయి హాకీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.శేఖర్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మహిళల విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 01-01-2009 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే వారు 01-01-2006 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు.
కడప జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప కలెక్టర్‌లో పశు వైద్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వగా ఇందులో భాగంగా కడపకు అశోక్ కుమార్‌ను నియమించారు. ఇక్కడ ఉన్న పూర్వపు ఎస్పీ హర్షవర్ధన్ రాజును నవంబర్‌లో అధికారులు బదిలీ చేయడంతో అప్పటినుంచి ఇంఛార్జి ఎస్పీగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొనసాగుతూ వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.
కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్. షంషుద్దీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన మీనాక్షిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపణలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈయనను పాఠశాల విద్య ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కడప ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగరాజు(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. KSRM ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు ఆయన్ను హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు త్వరలో డీఈగా ప్రమోషన్ రానున్నట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబీకులు శోకసంద్రంలో మిగిలారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని యథావిధిగా నేడు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలు ఏవైనా ఉంటే ప్రజలు నేరుగా కడప కలెక్టరేట్లో రేపు ఉదయం 10:30 గంటల నుంచి అధికారుల దృష్టికి తీసుకుని రావచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కడప బిస్మిల్లా నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్‌కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.
బ్రహ్మంగారి మఠానికి చెందిన చిత్రాల జెస్సీ అంతర్జాతీయ పోటీల్లో జంప్ రోప్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించింది. నేపాల్ అంతర్జాతీయ పోటీల్లో ఏపీ తరఫున పాల్గొంది. అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్‌ను సాధించిన ఆమెను అందరూ అభినందిస్తున్నారు. జెస్సీ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
ఈనెల 29 నుంచి తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు దేవుని కడప వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండగా, 28న సాయంత్రం అంకురార్పణ, 29న ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణం ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి 3న స్వామి వారి కళ్యాణం, 4న వైభవంగా రథోత్సవం, ఫిబ్రవరి 7న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Sorry, no posts matched your criteria.