India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

కడప జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సీఐ అశోక్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూమి సెటిల్‌మెంట్లు, ఇతర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై ఆధారాలు లభ్యమవ్వడంతో సీఐ అశోక్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. కాగా ఆయన గత రెండేళ్లుగా వీఆర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.

YVU స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డా. శేఖర్. సి. మండేలకు గౌరవ డాక్టరేట్‌లను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేస్తారన్నారు. వీరి జీవితం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

YVUలో ఈ నెల 13న జరగనున్న కాన్వకేషన్‌లో పట్టాలందుకొనే విద్యార్థుల సౌకర్యార్థం ఎంక్వయిరీ నెంబర్ (9703216198)ను ఏర్పాటు చేసినట్లు CE ప్రొ.కె.ఎస్.వి కృష్ణారావు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం YVU నుంచి, కడప ఆర్టీసీ, పాత బస్టాండ్, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. వాలంటీర్లు సేవలందిస్తారన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే కాన్వకేషన్ జరిగే ప్లేస్ తెలుస్తుందని పేర్కొన్నారు.

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.
Sorry, no posts matched your criteria.