Y.S.R. Cuddapah

News March 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారు, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,950
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,674
*వెండి 10 గ్రాముల ధర రూ.2,750

News March 10, 2026

కడప జిల్లాలో ఒక్కరోజే 273 కేసులు.!

image

కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు తనిఖీలు చేపట్టి 273 కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా రూ.64,710లు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ నచికేత్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 10, 2026

కడప: MSPతో 10,059 క్వింటాళ్లు కొనుగోలు

image

కడప జిల్లాలో సోమవారం నాటికి రైతుల నుంచి కనీస మద్దతు ధర(MSP)తో 10,059 క్వింటాళ్ల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. సుమారు 2,021 మంది రైతుల నుంచి 8,210 క్వింటాళ్ల శనగలు, 50 మంది రైతుల నుంచి 1,819 క్వింటాళ్ల కందులు, 1 రైతు నుంచి 30 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేశారు. జిల్లాలో 21 ప్రొక్యూర్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో క్వింటాలుకు రూ.200లు రాబడుతున్నారు.

News March 9, 2026

కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

image

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.

News March 9, 2026

కడపలో కేవలం ఆయన వర్గం టీడీపీలోకి వెళ్తోందా?

image

కడపలో ఇటీవల YCP నుంచి TDPలోకి కార్పొరేటర్లు చేరుతున్నారు. ఇందులో సింహభాగం మాజీ మేయర్ సురేశ్ బాబు వర్గమే TDP కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న సూర్యనారాయణ TDPలో చేరారు. ఆ తర్వాత దాదాపు 8 మంది కార్పొరేటర్లు YCPకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో నలుగురు చేరారు. మేయర్ సీటు కోల్పోవడంతో ఆయనే TDPలోకి పంపిస్తున్నారంటూ YCPలోని మరో వర్గం గుసగుసలాడుతున్నాయి.

News March 9, 2026

బద్వేల్: సొసైటీ బ్యాంకులో రూ.5 కోట్లకు పైగా అవినీతి?

image

బద్వేల్ ZPTC వంకెల చిన్న పోలిరెడ్డి గతంలో సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.5 కోట్లకు పైగా అవినీతి చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైతులకు తెలియకుండానే వారి భూములపై లోన్లు తీసుకొని అక్రమాలకు పాల్పడిన పోలిరెడ్డిని బి.కోడూరు పోలీస్ స్టేషన్లో రహస్య విచారణ చేస్తున్నారు. 2005 నుంచి 2022 వరకు సొసైటీ ఛైర్మన్‌గా ఆయన కొనసాగారు.

News March 9, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 9760 మంది హాజరు

image

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో జరిగిన ఇంటర్ 2nd ఇయర్ గణితం పేపర్-2B పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారు. నేటి పరీక్షలకు 10,136 మంది విద్యార్థులకు గాను.. 9,740 మంది విద్యార్థులు హాజరయ్యారు. 396 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 9381 మందికి గాను.. 9120 మంది పరీక్షలు రాశారు. 261 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 755 మందికి గాను.. 620 మంది హాజరయ్యారు.

News March 9, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,920
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,646
*వెండి 10 గ్రాముల ధర రూ.2,685.

News March 9, 2026

పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతి.!

image

పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి పోలీసులు సోమవారం తెలిపారు. అనసూయ (60), ఓబులేసు(58) మృతి చెందారని అన్నారు. వీరి సంబంధీకులు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ (9490387344, 9154666607) నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 9, 2026

బి.మఠం: అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

image

అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణి అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి, పైలట్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.