Y.S.R. Cuddapah

News July 19, 2024

రాజంపేట: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

రాజంపేట మండలం పోలి చెరువుకట్ట సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ ఏకశిర సుబ్బయ్య(27) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి భార్యాబిడ్డలు కన్నీటీపర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 19, 2024

BREAKING: కడపలో రౌడీ షీటర్ దారుణ హత్య

image

కడపలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బిల్డప్ సర్కిల్ వద్ద గల పుత్తా ఎస్టేట్‌లో వెంకటేశ్ అనే రౌడీ షీటర్‌ను కొద్దిసేపటి క్రితం దుండగులు హతమార్చారు. ఈరోజు సాయంత్రం వెంకటేశ్ కొంతమందితో మద్యం తాగుతున్న క్రమంలో మత్తులో మాటకు మాట పెరగడంతో గాజు సీసాతో వెంకటేశ్‌ను పొడవగా, మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 19, 2024

‘YVU ఇన్‌ఛార్జ్ వీసీ నియామకాన్ని వెనక్కి తీసుకోవాలి’

image

యోగి వేమన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా రామకృష్ణారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ హరిత డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆమె మాట్లాడుతూ.. SK యూనివర్సిటీ రిజిస్టర్‌గా రామకృష్ణారెడ్డి పనిచేసే సమయంలో అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, దీంతో ఏడాదిన్నరకే తొలగించారన్నారు. ఆయనను తొలగించుకుంటే ఆందోళన చేస్తామన్నారు.

News July 19, 2024

అన్నమయ్య జలాశయం పూర్తయ్యేనా..?

image

అన్నమయ్య జలాశయ పున:నిర్మాణంపై ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. 2021లో వచ్చిన వరదలకు డ్యాం మట్టికట్ట తెగిన విషయం తెలిసిందే. అప్పటి పాలకులు రెండేళ్లలో జలాశయాన్ని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. కొంత కాలంగా ప్రాజెక్ట్‌లోకి విపరీతంగా వరద రావడంతో ఆ నీటిని వదిలేందుకు సరిపడా గేట్లు లేవని అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News July 19, 2024

త్వరలో పోట్లగిత్త విడుదల: తులసి రెడ్డి

image

వెంకట్ దర్శకత్వంలో మానస్ హీరోగా తెరకెక్కిన సినిమా పోట్లగిత్త. ఈ సినిమాలో పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ఓ ప్రముఖ పాత్ర పోషించారు. వేముల చింతలజూటూరుకు చెందిన మరో వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ విలన్ వీరప్ప పాత్రలో నటించారు. పులివెందుల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు తులసి రెడ్డి వెల్లడించారు.

News July 19, 2024

కడప జిల్లాలో త్వరలో BSNL 4జీ సర్వీసులు

image

కడప జిల్లాలో త్వరలో 4జీ సేవలను అందించనున్నట్లు BSNL అనంతపురం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్ షాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భాగస్వామ్యంతో 4జీ సేవలను ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 460 సెల్ టవర్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. 2జీ, 3జీ సిమ్ కలిగి ఉన్నవారు ఉచితంగా 4జీ సిమ్ పొందవచ్చునన్నారు.

News July 19, 2024

రాజంపేట MP పర్యటనలో అల్లర్లకు కారణం అదేనా..?

image

పుంగనూరులో నిన్న ఉదయం రాజంపేట MP మిథున్ రెడ్డి పర్యటనలో భాగంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. పట్టణంలోని మాజీ MP రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చారు. గతంలోనే పుంగనూరుకు రావడానికి ఎంపీ ప్రయత్నించడంతో తిరుపతిలోనే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిన్నటి పర్యటనపై పోలీసులకు ముందస్తు సమాచారం లేదు. ఇదే సమయంలో జలాశయాల నిర్వాసితులు, టీడీపీ నేతలు ఎంపీని నిలదీసేందుకు రావడంతో పరిస్థితులు అదుపు తప్పాయి.

News July 19, 2024

కడప: అగమ్యగోచరంగా 100 ప్రభుత్వ పాఠశాలలు

image

జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 1,861 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 88,164 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో 100పైగా పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ పాఠశాలల భవిష్యత్ ఆందోళనగా మారింది. గత ప్రభత్వం తెచ్చిన జీవో.నం 117 వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వాపోయారు.

News July 19, 2024

ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలి: కడప ఎస్పీ

image

పోలీసు వృత్తిపట్ల నిబద్దత, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు సూచించారు. కడప పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభావవంతంగా విధులు నిర్వర్తించే ‘విజిబుల్ పోలీసింగ్’ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు. ఫిర్యాదులను ప్రాధాన్యతతో నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

News July 19, 2024

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలని, లింగ వివక్షతను చూపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షల నిర్మూలనపై కడప కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. బాలల లింగ నిష్పత్తిని గమనిస్తే.. బాలురతో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఈ అసమానతలను తొలగించి సమాజంలో ఆడపిల్లల శాతాన్ని పెంచాలన్నారు.