India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బద్వేలులో పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గోపవరం మండలం పీపీ కుంట చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు.

లంకమల అభయారణ్యంలో లభ్యమైన 4 నుంచి 8వ శతాబ్దం కాలం నాటి ఆదిమానవుల 12 శాసనాలను భారతదేశ పురావస్తుశాఖ ఎపిగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు బీటు కణతి గుండం, గోపాలస్వామి కొండ పరిసర ప్రాంతాలను గురువారం ఆదిమానవుల రేఖా చిత్రాలపై 6 మంది సభ్యుల బృందం పరిశోధన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దవటం రేంజర్ కళావతి పాల్గొన్నారు.

కడప జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా మార్చడమే నవోదయం 2.0 ప్రధాన ఉద్దేశమని, ఆ దిశగా జిల్లాలో సమూలంగా నాటుసారాను నిర్మూలించాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం నవోదయం 2.0పై జిల్లా SP అశోక్ కుమార్, DRO విశ్వేశ్వర నాయుడుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

బద్వేలుకు చెందిన ఆరు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల వివరాల మేరకు.. బద్వేలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్న మంజుల అనే బాలిక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో పొలతల మల్లికార్జునస్వామి వారి ఆలయాన్ని కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్ అధికారులకు బుధవారం రాత్రి పలు సూచనలు చేశారు. ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గాలు, క్యూ లైన్లలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం లోపల భక్తుల ప్రవేశం వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

కొడుకు మరణ వార్తను జీర్ణించుకోలేక ఆ తల్లి ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. చివరకు ఆమె మృతి చెందింది. ఈ విషాద ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. జంబు పుల్లమ్మ(70), పెద్ద కొడుకు జంబు శ్రీనివాసులు(52) ప్రకాష్ నగర్‌లో నివాసం ఉన్నారు. నాటువైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు.. ఆయాసంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్పృహ కోల్పోయిన తల్లికూడా ప్రాణాలు విడిచింది.

కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం పులివెందులకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. అనంతరం బెంగళూరుకు జగన్ బయలుదేరి వెళ్తారు.

➢ రేపు పులివెందులకు రానున్న జగన్
➢ మార్చి 1న కడపకు వస్తున్న హీరోయిన్ మెహరీన్
➢ కమలాపురం: కష్టాల కడలిలో కుల వృత్తులు
➢ YVU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రకాశ్ బాబు బాధ్యతలు
➢ జగన్ అసెంబ్లీకి వెళ్తే వారికి సినిమా: కడప ఎంపీ
➢ లింగాల మండలంలో దారుణ హత్య
➢ జగన్ సంతకం పెట్టడానికే అసెంబ్లీకి వెళ్లారు: బీటెక్ రవి
➢ మార్చి 1 నుంచి జమ్మలమడుగులో ప్లాస్టిక్ నిషేధం
➢ శివరాత్రికి పొలతలలో ఏర్పాట్లు పూర్తి

లింగాల మండలంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. దిగువపల్లి గ్రామంలో పప్పూరు గంగిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం దారుణంగా హత్య చేశారు. పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన గంగిరెడ్డిని వేట కొడవల్లతో నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. కావున ప్రజలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వీకరించనున్నట్లు * అవకాశం
Sorry, no posts matched your criteria.