India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్ట్ షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు మాట్లాడుతూ.. వారం రోజుల్లో 284 బెల్ట్ షాపులను గుర్తించి దాడులు చేసి 371.1 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. 119 మంది అరెస్ట్ చేసి, 115 కేసుల నమోదు చేశామన్నారు. మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ 213 మంది పాత నేరస్థులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.
బాలుడి మర్మాంగాన్ని కుక్కలు కొరికిన విషాద ఘటన చిట్వేలిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చిట్వేలిలోని సత్యమ్మ వీధిలో శనివారం పెరిమేటి ఋషి(7)పై కుక్కలు దాడి చేసి మర్మావయవాలను చీల్చి గాయపరిచాయి. ఇంట్లో వాళ్లు గమనించి బాలుణ్ని వెంటనే చిట్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హుటాహుటిన రాజంపేటకు పంపారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఇంకో 3 రోజులు గడిచే వరకు ఏమి చెప్పలేమన్నారు.
వైవీయూ MBA, MBA – HRM నాల్గవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య కె కృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు, ఎంబీఏ విభాగ డీన్ ఆచార్య వై.సుబ్బరాయుడుతో కలిసి శనివారం విడుదల చేశారు. వైవీయూలోని తన ఛాంబర్లో ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు MBAలో, MBA – HRMలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఈనెల 5న జిల్లాకు రానున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి ఆమె జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం కడప కలెక్టరేట్‌లో జరిగే జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారు. జిల్లాకు రానున్న మంత్రి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో భేటీ కానున్నారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.
వైవీయూ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలను జిల్లాలోని కేంద్రాలను నిర్వహిస్తున్నామని 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.
కొవ్వొత్తి పొరపాటున చీరకు అంటుకొని మహిళ గాయాలపాలైన ఘటన పుల్లంపేట మండలంలోని రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఓ మహిళ ఇంట్లో దీపాలు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకొని గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కడపలో యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. కడప చిన్నచౌక్‌కు చెందిన సాయి చరణ్ తనలోని ప్రతిభతో గంటల తరబడి కష్టపడి క్యూబ్స్‌తో సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపాన్ని చేశారు. ఇతను గతంలో అనేకమంది ప్రముఖుల చిత్రాలను అనేక మంది చిత్రీకరించారు. తల్లిదండ్రుల సహకారంతోనే ఇలాంటివి చేస్తున్నట్లు సాయి చరణ్ స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కడప జిల్లాలో తన మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. బెంగళూరు నుంచి రెండు రోజుల క్రితం హెలికాప్టర్‌లో ఇడుపులపాయ వెళ్లి అనంతరం పులివెందుల చేరుకున్నారు. మంగళ, బుధవారాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని పులివెందులలోని తన నివాసంలో కలిశారు. క్యాడర్‌కు దిశానిర్దేశం చేసి గురువారం ఉదయం ఇడుపులపాయ చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కడప జిల్లా మహిళ సత్తా చాటింది. ప్రొద్దుటూరుకు చెందిన సుజిత బ్యూటీ క్లినిక్ నడుపుతున్నారు. చెన్నై వేదికగా WBPC ఆధ్వర్యంలో కాస్మటాలజిస్ట్ పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు 18 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా.. వరల్డ్ బ్యూటీ కాస్మటాలజిస్ట్, అస్థెటిక్ ఐకాన్ అవార్డులను సుజిత దక్కించుకున్నారు. హీరో విశాల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమెను పలువురు అభినందించారు.
వైవీయూ తెలుగు శాఖ స్కాలర్ తమ్మిశెట్టి వెంకట నారాయణకు డాక్టరేట్ లభించింది. ఆచార్య ఎం.ఎం.వినోదిని పర్యవేక్షణలో “తెలుగులో శ్రామిక కథలు – స్త్రీ చైతన్యం (1980 నుంచి 2015 వరకు)” అనే శీర్షికపై పరిశోధన చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం బూడిదగుంటపల్లెకు చెందిన వెంకట నారాయణ చేసిన పరిశోధనలో మూడున్నర దశాబ్ద కాలంలో గ్రామీణ, పట్టణ మహిళల స్థితిగతులు, ఆనాటి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు.
Sorry, no posts matched your criteria.