India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వల్లూరు మండల పరిధిలోని పైడికాలువ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రాముడు (40)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వల్లూరు ఎస్సై శివ నాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక్‌సభలో మంగళవారం కడప MP అవినాశ్ రెడ్డి మాంసంపై ప్రశ్నలు లేవనెత్తారు. APలో నాటుకోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. కేంద్రం పౌల్ట్రీ అభివృద్ధికి రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా చర్యలు తీసుకుంటుందా అని అడిగారు. స్పందించిన కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి రాజీవ్ రంజన్ ఏపీలో నాటుకోడి మాంసం ధర కిలో రూ.500 ఉండగా మటన్ ధర దాదాపు రూ.900 ఉందని బదులిచ్చారు.

కడప జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బద్వేల్, వేంపల్లి, పోరుమామిళ్ల, పులివెందుల, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, సిద్దవటం తదితర స్టేషన్ల ఎస్సైలు ఉన్నారు. బదిలీ అయిన వారు వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

కడప సర్కిల్ పరిధిలో జనవరి నెలలో 361.886 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ వినియోగం జరిగింది. కడప డివిజన్లో 51.999, పులివెందుల డివిజన్లో 63.585, ప్రొద్దుటూరు డివిజన్లో 94.843, మైదుకూరు డివిజన్లో 61.638, రాజంపేట డివిజన్లో 50.168, రాయచోటి డివిజన్లో 39.653 MU విద్యుత్ వినియోగం జరిగింది. కడప సర్కిల్ జనవరి నెల విద్యుత్ కోటా 323.862 MU కాగా.. 361.886 MU వినియోగం జరిగింది.

కడప జిల్లాలో రైతులకు యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నారని YCP ఆరోపించింది. కాశినాయన మండలం ఓబులాపురంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు యూరియా కోసం నిరీక్షణ చెందుతున్నారని ట్వీట్ చేసింది. స్టాక్ తక్కువగా ఉండటంతో యూరియా కోసం రైతులు తోపులాట చేసుకోవడంతో పలువురు రైతులు అస్వస్థత చెందారని పేర్కొంది. ఇంకెన్ని రోజులు రైతులకు ఈ యూరియా కష్టాలు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది.

ప్రొద్దుటూరులో నిన్నటికన్నా ఈరోజు బంగారు, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.14,900 ఉండగా.. నేడు రూ.15,850కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.13,708గా ఉండగా.. నేడు రూ.14,582కు చేరుకుంది. ఇక వెండి 10 గ్రాముల ధర నిన్న రూ.2,500 ఉండగా.. రూ.280 పెరగడంతో రూ.2,780కు చేరుకుంది.

కడప జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి రూ.205 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. (రూ.కోట్లలో) బద్వేల్-10.71, జమ్మలమడుగు-11.74, కమలాపురం-9.53, ప్రొద్దుటూరు-46.10, మైదుకూరు-7.77, ముద్దనూరు-3.95, పులివెందుల-13.23, సిద్దవటం-2.66, వేంపల్లె-6.75, దువ్వూరు-2.79, కడప(U)-50.45, కడప(R)-39.35 ఆదాయం లభించింది.

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి AMCలు రూ.10.22 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప-రూ.1.86 కోట్లు, ప్రొద్దుటూరు-రూ.1.20 కోట్లు, బద్వేల్-రూ.1.50 కోట్లు, మైదుకూరు-రూ.1.89 కోట్లు, జమ్మలమడుగు-రూ.69.15 లక్షలు, పులివెందుల-రూ.90.70 లక్షలు, రాజంపేట-రూ.53.25 లక్షలు, కమలాపురం-రూ.77.90 లక్షలు, సిద్దవటం-రూ.14.23 లక్షలు, ఎర్రగుంట్ల-రూ.52.71 లక్షలు, సింహాద్రిపురం-రూ.16.91 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర సోమవారం మైదుకూరుకు చేరుకుంది. ఈయన హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మైదుకూరుకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికీ 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైందని గణేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటానన్నారు.
Sorry, no posts matched your criteria.