India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. YCPకి చెందిన పలువురు కార్పొరేటర్లు సోమవారం TDP తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కడప MLA మాధవి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 7 మంది YCP కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్ చేరగా.. నేడు చేరినవారితో కలిపి 8మంది వైసీపీ కార్పోరేటర్లు పార్టీని వీడారు.
ఎర్రగుంట్లలోని ఆర్టీపీపీ స్టేజ్-4 ప్లాంట్‌లో విషాదం నెలకొంది. ప్లైయాష్‌లో కూర్చున్న సందీప్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందారు. స్థానికులు ఆర్టీపీపీ యాజమాన్యంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి ఆర్టీపీపీ యాజమాన్యం రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
పులివెందుల పట్టణం నల్లపురెడ్డి పల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న కాలువలో వేముల మండలం మబ్బుచింతలపల్లెకు చెందిన పట్నం రామాంజనేయులు శుక్రవారం సాయంత్రం గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సోమవారం ఉదయం కాలువలో గాలింపు చర్యలు చేపట్టి రామాంజనేయులు మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో రామాంజనేయులు మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.
కడప కార్పొరేషన్‌లో అలజడి రేగింది. పలువురు కార్పొరేటర్లు YCPని వీడి TDPలో చేరుతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న కార్పొరేటర్లతో మేయర్ సురేశ్ బాబు, MP అవినాశ్ రెడ్డి చర్చలు జరిపినా విఫలం అయినట్లు సమాచారం. అంతే కాకుండా కొందరు కార్పొరేటర్లు MLA మాధవిరెడ్డి, కడప జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో చర్చించారు. ఇవాళ లేదా ఎల్లుండి చంద్రబాబు సమక్షంలో చేరనున్నట్లు తెలుస్తోంది.
పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వాముల పున్నమి గ్రామోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివార్లను వేరువేరు పల్లకిలపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దివిటీ వెలుగులు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని ఘనంగా చేపట్టారు.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం బలపనూరులో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలో TDP అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. బలపనూరు సాగునీటి సంఘం ఛైర్మన్‌గా వై వీరప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దశాబ్దాల తర్వాత ఇక్కడ టీడీపీ అధికారం చేపట్టడంతో సంబరాలు చేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు తన సొంత జిల్లా కడపలో బిగ్ షాక్ తగలనుందా.? కడప కార్పొరేషన్‌లో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు YCPని వీడి TDPలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కార్పొరేటర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా మిగిలిన ఏడుగురు కార్పొరేటర్లు ఎల్లుండి CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.
రాజంపేటలో శనివారం రోడ్ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. కిరణ్ పుట్టిన రోజు నాడే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గోడపత్రాలు, కరపత్రాలను శనివారం తన క్యాంప్ ఆఫీసులో కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విడుదల చేశారు. ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
శ్రీ అవధూత కాశినాయన మండలంలోని సావిశెట్టి పల్లె ఆయకట్టు చెరువుకు సంబంధించి శనివారం నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల అధికారి బాలి రెడ్డి తెలిపారు. నీటి సంఘం అధ్యక్షుడిగా విజయరెడ్డి, ఉపాధ్యక్షురాలిగా బండి సుబ్బ లక్ష్మమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బండి రామచంద్రారెడ్డి, రఘురాంరెడ్డి వారిని అభినందించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.