India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పులివెందులకు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గం.కు పులివెందుల చేరుకోనున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక అక్కడి నుంచి 11:40 గం.కు ఆయన ఇంటికి వెళతారని పేర్కొంది.
ఏపీలో దాదాపు రూ.1397 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే వివిధ స్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా కడప రైల్వే స్టేషన్‌ను రూ.20 కోట్లతో ఆధునికీకరించనున్నారు. అంతర్జాతీయ హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సంబంధిత పనులకు ప్రధాని మోదీ ఇటీవల వర్చువల్‌గా శంకుస్థాపన చేయడంతో పనులు జోరుగా జరుగుతున్నాయి.
రాజంపేటలో విషాద ఘటన జరిగింది. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు కూలీ పని నిమిత్తం రాజంపేటకు వలస వచ్చారు. పట్టణంలోని మన్నూరు సాతవీధిలో జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. సుశాంక్(2) పచ్చి చికెన్ ముక్క నోట్లో వేసుకున్నాడు. ఈక్రమంలో ఊపిరాడక మృతిచెందాడు.
నేరాలను నిరోధించడంలో, నేరస్థులను గుర్తించి అరెస్ట్ చేయడంలో CC కెమెరాల పాత్ర కీలకమైనదని కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులకు కడప పోలీసు కార్యాలయంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వ్యాపారులు తమ వంతు సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. నేటి ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి 08562-244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలపాలన్నారు.
వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఉర్దూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న షేక్ సానియా అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీకి వెళ్ళమని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై, ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. ఈ ఘటన స్థానికులను విషాదంలో ముంచేసింది.
ఈ నెల 22వ తేదీ గోపవరం మండలం శ్రీనివాసపురంలో తన బాబాయి తిప్పిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని భాస్కర్ రెడ్డి హత్య చేసిన విషయం విదితమే. నాటి నుంచి కనిపించకుండా పోయిన భాస్కర్ రెడ్డిని శనివారం బద్వేలులోని నెల్లూరు రోడ్డు సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగభూషణం తెలిపారు. భాస్కర్ తన తల్లితో గొడవ పడుతున్న సమయంలో మృతుడు వాదిస్తూ ఓసారి చేయి చేసుకోవడంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు.
కడపలో ఆటోలకు నూతనంగా కేటాయించిన పోలీసు సర్టిఫికెట్ PC నంబర్ సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. కడప పరిధిలోని శంకరాపురానికి చెందిన నాగరాజు ఆటోలో బ్యాగ్ మర్చిపోయాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి తాను ఎక్కిన ఆటో PC నంబర్ వారికి చెప్పాడు. వెంటనే ట్రాఫిక్ సీఐ జావేద్ నేతృత్వంలో ఆటోను వెంటనే కనుగొన్నారు. బాధితునికి ఆటో డ్రైవర్ ద్వారా పోగొట్టుకున్న బ్యాగ్ అందజేశారు. బాధితుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా.. వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తులో విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపారు.
కొడుకు బుడిబుడి అడుగులు వేస్తే తండ్రికి ఆనందం. అదే కొడుకు తండ్రి కళ్లెదుటే చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇటువంటి ఘటన వేంపల్లి-రాయచోటి రహదారిపై శనివారం జరిగిన విషయం తెలిసిందే. వీరపునాయుని పల్లె మండలం మొయిలచెరువుకు చెందిన బాలగంగాధర్, రమణారెడ్డి బైక్‌పై చక్రాయపేటకు వెళుతుండగా.. ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలగంగాధర్ అక్కడికక్కడే చనిపోగా.. రమణారెడ్డికి కాలు విరిగింది. ఈ ఫొటో అందరిని కలిచివేస్తోంది.
Sorry, no posts matched your criteria.