India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎర్రగుంట్ల మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిలంకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి కునిషెట్టి వెంకటనారాయణ(50), కృష్ణవేణి భార్యాభర్తలు. చిన్న కుమారుడు Hydలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెద్ద కొడుకు లండన్‌లో MS చదివినా, ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. దీంతో మనస్తాపంతో వెంకటనారాయణ యాసిడ్ తాగగా, ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందాడని సీఐ నరేశ్ బాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న జిల్లాకు రానున్నారు. అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్తూ ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో అన్నమయ్య జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు సంబేపల్లి మండలంలో సీఎం పర్యటిస్తారు. తిరిగి కడపకు చేరుకుని గన్నవరం వెళ్తారు.

దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు గురువారం పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చాడు. ముందుగా వాహనంపై కడప రాయుడిని ఆసీనులు చేసి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించి, మహా హారతి అనంతరం గ్రామోత్సవం ప్రారంభమైంది. ఈ ఊరేగింపులో స్వామిని తిలకించిన భక్తులు తన్మయం చెంది, స్వామి వారికి కాయ కర్పూరం సమర్పించారు.

నేత్రదానం చేయడం వల్ల ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చునని నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. గురువారం వేముల మండలం కొత్తపల్లికి చెందిన చందా మల్లమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించడంతో రాజు మృతురాలి ఇంటికి వెళ్లి కార్నియాలను సేకరించి హైదరాబాదులోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి పంపించారు.

జాతిపిత మహాత్మా గాంధీకి కొండాపురం మండలంలోని పలు గ్రామాలతో అనుబంధం ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పాదయాత్ర చేసిన ఆయన.. బొందలదిన్నె, పాత సుగుమంచిపల్లి, పాత తాళ్లప్రొద్దుటూరు, పాత చౌటుపల్లి, మంగపట్నం మీదుగా కడపకు వెళ్లారని అప్పటితరం మనుషులు చెబుతుంటారు. పాత కొండాపురానికి చెందిన నబీ రసూల్ అనే వ్యక్తి గాంధీతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రాచమల్లు ముని రత్నమ్మ(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లో పెద్ద కుమారుడు కిరణ్ రెడ్డి ఇంట్లో ఉండగా గురువారం ఉదయం ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు ఆమె భౌతికకాయాన్ని తీసుకురానున్నారు.

ఎన్నికల సమయంలో సూపర్-6 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు, కూటమి నాయకులు నేడు మేనిఫెస్టో అమలుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మండిపడ్డారు. నీతి ఆయోగ్ నివేదికపై మాట్లాడుతూ.. ‘‘సంక్షేమ పథకాల అమలుకు ఇంకా సంపద సృష్టించాల్సి ఉందని సీఎం అంటున్నారు. 15% పెరిగితే తప్ప పథకాలు అమలు చేయలేమన్నారు. ఆ 15 శాతం సంపద ఎప్పుడు పెరుగుతుందో ప్రజలకు చెప్పాలి’ అని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. సింహాద్రిపురం మండలం ZPHS నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం జిల్లా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచిందన్నారు. ప్రభుత్వం, ప్రవేటు, దాతలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో అద్భుతమైన స్కూలును నిర్మించారని కలెక్టర్ అన్నారు.

పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో ఎ.ఆర్ పోలీసు సిబ్బందికి మొబిలైజేషన్లో భాగంగా పైరింగ్ ప్రాక్టీస్‌లో ఎస్పీ పాల్గొని ఫైరింగ్ సాధన చేశారు. ‘వజ్ర’ వాహనం నుంచి గ్యాస్ షెల్స్ ఫైరింగ్ చేసి పరిశీలించారు.

పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్‌లో ఎ.ఆర్ పోలీసు సిబ్బందికి మొబిలైజేషన్లో భాగంగా పైరింగ్ ప్రాక్టీస్‌లో ఎస్పీ పాల్గొని ఫైరింగ్ సాధన చేశారు. ‘వజ్ర’ వాహనం నుంచి గ్యాస్ షెల్స్ ఫైరింగ్ చేసి పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.