India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పులివెందులలో వైఎస్ జయమ్మ 18వ వర్ధంతి వేడుకలలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని డిగ్రీ కళాశాలలోని జయమ్మ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైయస్ జార్జిరెడ్డి, సతీమణి వైయస్ భారతమ్మ, వైయస్ సుధీకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, వైఎస్ సౌభాగ్యమ్మలు నివాళులు అర్పించారు.

కడప జిల్లా నూతన ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను శుక్రవారం కలిశారు. నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కలెక్టర్‌ను అడిగి ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన కడప కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు సీఎం ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాటం చేయాలని సూచించారు.

వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం చూస్తుంటే, పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనపడుతోందని పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాజకీయాలకు విజయ్ సాయిరెడ్డి రాజీనామా చేశారంటే అప్రూవర్‌గా మారడం ఖాయమన్నారు. ఇక జగన్ డిస్ క్వాలిఫై అవుతారని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమంటూ ట్వీట్ చేశారు.

కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుంచి తక్షణం తొలగించి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ డిమాండ్ చేశారు. మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డీటీసి చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా కడప ఆర్టీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడటం దారుణమన్నారు.

కడప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ చంద్రశేఖర్ వేధింపుల పట్ల అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నతాధికారులు, జాయింట్ రవాణా కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో శుక్రవారం కడప రవాణా శాఖ కార్యాలయంలో స్వయంగా బాధిత మహిళా ఉద్యోగితో మాట్లాడారు. అనంతరం ఘటనపై ప్రత్యేకంగా విచారించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాలు స్వయంగా పరిశీలించి డీటీసీ చంద్రశేఖర్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కడప జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సదరు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా ఉద్యోగులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిర్లక్ష్యంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అతడిపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు.

కడప నగరంలో బుధవారం శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పాలకొండల్లో భక్తులు అఖండ విజయజ్యోతిని వెలిగించారు. అయోధ్య ఐక్యవేదిక కమిటీతోపాటు, పుష్పగిరి తీర్థ క్షేత్ర పరిరక్షణ కమిటీలతో పాలకొండల దిగువన ఆర్చీ వద్ద కొండపై ప్రత్యేకంగా చదును చేసిన ప్రాంతంలో 250 మీటర్ల వస్త్రాన్ని 50 లీటర్ల నేతిలో తడిపి చుట్టలుగా చుట్టి శివలింగం ఆకారానికి తెచ్చారు.

కోడి తెచ్చిన తంటా ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మలమడుగు(M), పొన్నతోటలో ఉండే నాగలక్ష్మమ్మ చెట్టుపై పక్కింటి కోళ్లు వచ్చి పెంట వేస్తున్నాయని రోషమ్మకు చెప్పింది. దీంతో రోషమ్మ కుటుంబ సభ్యులతో నాగలక్ష్మమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో నాగలక్ష్మమ్మ, భర్త, కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్చారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ శుక్రవారం బాధ్యతలను స్వీకరిస్తున్నట్టు పోలీస్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు ఎస్పీలను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడప ఎస్పీగా అశోక్ కుమార్‌ను నియమించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.