India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ ఛైర్మన్‌గా ప్రస్తుత కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌ను నియమిస్తూ.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న వైఓ నందన్ సీడీఎంఏ డీడీగా బదిలీ అయిన నేపథ్యంలో ప్రభుత్వం జేసీకి ఇన్‌ఛార్జి వైస్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారు.
వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.
కడప జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మొత్తం ఇప్పటికే 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 22 ప్రతిపాదనలు చేశామని, ఇందులో కడపలో 19, ప్రొద్దుటూరులో 1, కమలాపురంలో 2 కేంద్రాలు ఉన్నాయన్నారు.
పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు మొబైల్స్‌ను అందజేశారు. దాదాపు రూ.1.8 కోట్ల విలువగల 555 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ప్రత్యేక డ్రైవ్ లో సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కనుగొన్నారు.
కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.
కడప ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ శివశంకర్ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌కు తెలిపారు.
హౌస్‌టు హౌస్ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్తయిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.
సిద్దవటంలోని పెన్నా నదిలో బుధవారం పుల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (6) అనే బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఇస్మాయిల్ ప్రమాదశాత్తు నీట మునిగాడు. ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
గాంధీ జయంతి సందర్భంగా కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వతంత్ర్యం అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.